నటీనటులు : శ్రీనాధ్ మాగంటి, సాక్షి కక్కర్, రచన స్మిత్, రుచి పాండే,రచ్చ రవి, కిరాక్ ఆర్.పి, జీవా, గౌతం రాజు, అప్పారావు తదితరులు
విడుదల : 4-08-2017
సంగీతం : బాలు స్వామి
నిర్మాత: సరిత
దర్శకత్వం: వి. రవివర్మ
హర్రర్ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. హర్రర్ సినిమాలో కామెడీ ని మిక్స్ చేసి తీసిన సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలు అందుకుంటున్నాయి. అ నేపథ్యంలో నూతన దర్శకుడు రవివర్మ తెరకెక్కించిన చిత్రం ఇదేం దెయ్యం. ముగ్గురు అమ్మాయిలతో అనేది ఉప శీర్షిక. శ్రీనాథ్ మాగంటి, సాక్షి కక్కర్ లతో పాటు నూతన తారలను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ ముగ్గురు అమ్మాయిలతో ఎలా భయపెట్టారు. ఇంతకీ ఆ దెయ్యం కథ ఏమిటి ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
కథ : రాజేష్ ( శ్రీనాథ్ మాగంటి ), గిటార్ గిరి (రచ్చ రవి ), ఆదికేశవ రెడ్డి ( కిరాక్ ఆర్పీ ) ఈ ముగ్గురు స్నేహితులు ఎలాగైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ కోరిక నెరవేరక పోవడంతో పువ్వు స్వామి ( జీవ ) దగ్గరికి వెళతారు. వీళ్ళ సమస్యను తెలుసుకున్న ఆ స్వామిజి.. మీరు ఊరికి దూరంగా ఉన్న డాగ్ బంగ్లా లో 30 రోజులపాటు అక్కడే ఉండాలని అప్పుడే మీ సమస్య తీరుతుందని చెప్పి వాళ్ళని అక్కడికి తన మాయతో పంపిస్తాడు. వాళ్లతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు శిరీష ( సాక్షి కక్కర్ ), మానస ( రచన), ప్రత్యూష ( రుచి) లు ఉండడం చూసి .. ఈ ముగ్గురు ఆ ముగ్గురు అమ్మాయిలను ప్రేమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ ఇంట్లో ఇంకా ఎదో ఉందన్న అనుమానం కలుగుతుంది ఈ ముగ్గురు అబ్బాయిలను.. బయపెట్టడమే కాకుండా .. వీళ్ళ వీపు విమానం మోత మోగిస్తుంటుంది కనపడని శక్తి. ఈ విషయాన్నీ ఆ అమ్మాయిలకు చెప్పాలని వెళితే .. వాళ్ళు ముగ్గురే ఈ దయ్యాలని కనుక్కుంటారు ? ఆ తరువాత వీరి పరిస్థితి ఏమిటి ? అసలు వాళ్ళు దయ్యాలుగా ఎందుకు మారారు ? ఆ దయ్యాల బారి నుండి ఈ ముగ్గురు యువకులు తప్పించుకున్నారా ? లేదా అనేది తెలియాలంటే మాత్రం థియేటర్ కి వెళ్లాల్సిందే.
నటీనటుల ప్రతిభ : శ్రీనాథ్ మాగంటి తన పాత్రలో బాగా నటించాడు. మంచి హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తూనే .. భయపడే సన్నివేశాల్లో చక్కగా చేశాడు. ఇక ముగ్గురు హీరోయిన్స్ సాక్షి, రచన, రుచి లు తమ పాత్రల్లో మంచి నటన కనబరుస్తూనే అటు గ్లామర్ గా అందాలు ఆరబోశారు. సాక్షి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. ఇక జబర్దస్త్ నటులు రచ్చ రవి, కిరాక్ ఆర్పీ ఇద్దరు తమ పాత్రల్లో ఆడుకున్నారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లుగా తమ సత్తా చాటారు. ముఖ్యంగా దెయ్యం వీళ్ళను కొడుతున్న సన్నివేశాలు బాగా పండించారు. మిగతా పాత్రల్లో జీవ, అప్పారావు, గౌతమ్ రాజు లు తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. స్వామీ మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు బాగున్నాయి. ఇక నేపధ్య సంగీతం విషయంలో ఇంకా కాస్త కేర్ తీసుకోవలసి ఉంది. అలాగే కృష్ణ ప్రసాద్ అందించిన కెమెరా పనితనం బాగుంది .. కానీ కొన్ని సన్నివేశాల్లో ఇంకొన్ని మెళకువలు పాటించి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో ఎక్కడ లాగ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక దర్శకుడు రవివర్మ గురించి చెప్పాలంటే .. ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ సాగుతుంది కాబట్టి .. ఈ నేపథ్యంలో కొత్తతరహా కథను ఎంచుకున్నాడు. జనరల్ గా ఒకే దయ్యం గురించి మనం ఇదివరకు చాలా సినిమాల్లో చూశాం .. కానీ ఈ సినిమాలో ఏకంగా మూడు దెయ్యాలతో కామెడీ పండించి ప్రేక్షకులకు కామెడీ అందించాడు. దర్శకుడిగా స్క్రీన్ ప్లే విషయంలో మంచి కేర్ తీసుకున్నాడు. కథ , కథనాల విషయంలో దర్శకుడి పనితనం బాగుంది.
దర్శకుడు తీసుకున్న కథ కొత్తగా ఉన్నా, కథనం పరంగా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు. అయినా కామెడీ విషయంలో ప్రేక్షకులను పూర్తీ స్థాయిలో నవ్వించే ప్రయత్నం చేసారు. జబర్డస్ట్ రచ్చ రవి, కిరాక్ ఆర్పీ ల కామెడీ ఓ రేంజ్ లో ఉంది. ఇక కొత్త హీరో, హీరోయిన్ శ్రీనాథ్ , సాక్షి , రచన , రుచి లు చక్కగా నటించి మార్కులు కొట్టేశారు. ఈ సినిమాలో ఇదేం దెయ్యం అనే టైటిల్ కి తగ్గట్టే దెయ్యం పెట్టె కష్టాలు బాగా చూపించారు.
ట్యాగ్ లైన్: హర్రర్ సినిమాలు చూసేవారు ఒకసారి చూడొచ్చు..!
రేటింగ్ : 2/5