నేను శైలజ ముందు వరకు రామ్ వరస ప్లాపులతో కొట్టుమిట్టాడాడు. ఆ సినిమాకు ముందు వరకు రామ్ వరుసగా మాస్ స్టోరీలు ఎంచుకుంటూ మితిమీరిన ఓవర్‌యాక్షన్ చేస్తూ బొక్కబోర్లాపడ్డాడు. ఇక నేను శైలజ సినిమాలో రామ్ పెర్పామెన్స్ చూసిన వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరికి తెలిసిన ప్రేమకథనే దర్శకుడు తిరుమల కిషోర్ కొత్తగా ప్రజెంట్ చేయడంతో పాటు రామ్ యాక్షన్ ఒక్కసారిగా మారిపోవడంతో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
నేను శైలజ తర్వాత రామ్ మరోసారి ఫాత ఫార్మాట్‌లోకి వెళ్లిపోయి హైపర్ చేసి మళ్లీ ప్లాప్ ఇచ్చాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలు తనకు కలిసిరావడం లేదని భావించిన రామ్ మళ్లీ తనకు క్లాస్ టచ్‌తో మంచి హిట్ ఇచ్చిన తిరుమల కిషోర్‌నే నమ్ముకున్నాడు. నేను శైలజ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఉన్నది ఒక్కటే జిందగీ మంచి అంచనాలతో ఈ రోజు రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్, దుబాయ్‌లలో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అక్కడ నుంచి ఎలా టాక్ వచ్చిందో ? చూద్దాం.
దర్శకుడు తిరుమల కిషోర్ ఈ సినిమాకు ఫ్రెండ్‌షిఫ్ +లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. సినిమా అంతా ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కథనం నడిపించాడు. సినిమాలో రామ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌లు ఉన్నా రామ్-అనుపమ పెర్పామెన్స్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. ఫస్టాఫ్ అంతా ఫ్రెండ్‌షిఫ్, లవ్ సన్నివేశాలతో చాలా డీసెంట్‌గా కూల్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చిన ఎమోషనల్ ట్విస్ట్ హార్ట్ టచ్చింగా ఉంది.
ఇక ఫస్టాఫ్ చూసిన ప్రేక్షకుడికి సెకండాఫ్‌పై ఎంతో నమ్మకం ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు అంచనాలు పూర్తిగా అందుకోలేదు. కథకు కీలకమైన సెకండాఫ్‌లో కథనం చాలా స్లో అయ్యింది. ఇక ఫైనల్‌గా మంచి క్లైమాక్స్‌తో సినిమాకు ముగింపు ఇచ్చాడు. ఫైనల్‌గా చెప్పాలంటే దర్శకుడు తిరుమల కిషోర్ ఫ్రెండ్‌షిఫ్ +ప్రేమకథను బేస్ చేసుకుని ఓ ఎమోషనల్ సినిమాను తీశాడు. సినిమా అయితే డీసెంట్‌గానే ఉంది.
ప్లస్ పాయింట్స్ :
-రామ్ - అనుపమ పరమేశ్వరన్ పెర్పామెన్స్
- ఫస్టాఫ్
- లవ్ + ఫ్రెండ్ షిఫ్ ఫార్ములాలో ఫ్రెష్‌స్టోరీ
- ఇంటర్వెల్, క్లైమాక్స్
- దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్
మైనస్‌పాయింట్స్:
- సినిమాలో అక్కడక్కడా పాత వాసనలు
- సెకండాఫ్‌లో నత్తనడక కథనం
- మాస్ ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం
ఫైనల్‌గా....
ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాకు డీసెంట్ టాక్ ఉంది. రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం కలిసిరానుంది. అయితే ఏ క్లాస్ మూవీగా ఉన్న ఈ సినిమా బీ, సీ సెంటర్లలో ఎలా ఆడుతుందో ? కమర్షియల్‌గా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో ? చూడాలి. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్