బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: నాని, సాయి పల్లవి, భూమిక, రాజీవ్ కనకాల, నరేష్, ప్రియదర్శి, ఆమని, వెన్నెల కిషోర్ మొదలగు వారు.
సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
కథ, కథనం, దర్శకత్వం: వేణు శ్రీరామ్
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటేనే.. అన్నిటీకి సర్దుకుపోవడం. అటు హై క్లాస్ లా ఉండను లేరు... ఇటు లో క్లాస్ లా మెలగను లేరు. ప్రతి ఒక్క విషయంలోనూ కంప్రమైజ్ అంటూ సర్దుకుపోవడమే మిడిల్ క్లాస్ కుటుంబాలు పడే కష్టాలు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో నేచురల్ స్టార్ నాని - సాయి పల్లవి లు జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా తెరకెక్కింది. మరి మిడిల్ క్లాస్ లో ఉండే ఒడిదుడుకులను కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించారని ఎంసీఏ ట్రైలర్ విడుదల చేసినప్పుడే స్పష్టంగా తెలిసింది. మరి మన పక్కింట్లో ఉండే అబ్బాయి లక్షణాలతో నాని హీరోగా పైకెదిగాడు. చూడగానే అరే మన పక్కింటి అబ్బాయి అనిపించేంతగా ఉంటాయి నాని నటన, డైలాగ్స్... మరి అలా ఉండబట్టే నాని నుండి వచ్చిన ఏడు సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటనను ప్రదర్శించే నాని ఈ ఏడాదిలో వచ్చిన నేను లోకల్ లో జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతూ, అమ్మాయిని ప్రేమలో పడెయ్యడానికి కష్టపడే కుర్రాడిగా చేస్తే.. మళ్ళీ నిన్నుకోరి సినిమాలో తనతో ప్రేమలో పడిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే... ఆ ప్రేమికుడు పడే ఆరాటాన్ని నాని ఎంతో స్పష్టంగా చూపించాడు. మరి ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాని నటన ఎలావుండబోతుందో అనేది కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. అలాగే హీరోయిన్ సాయి పల్లవి కూడా ఫిదా సినిమాలో నట విశ్వరూపాన్ని ప్రదర్శించి అచ్చ తెలుగమ్మాయిలా కనబడుతూ మనకి కూడా అలాంటి అందమైన లవర్ ఉంటే బావుంటుంది అనిపించేంతాగా ఆమె నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలే ప్రాణంగా భావించి అందరికి నచ్చేలా.. అందరూ మెచ్చుకునేలా సినిమాలు తెరకెక్కించే నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించడం ... దర్శకుడు వేణు శ్రీరామ్.. ఒకపక్క కుటుంబ విలువలు తెలియజెప్పేందుకు వదిన - మరిది అనే కాన్సెప్ట్ ని ఎంచుకోవడం, మరోపక్క ఒక అమ్మాయి మొదటిసారి అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చూపించడం వంటి విషయాలతో తెరకెక్కిన ఈ ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వరుస విజయాలందుకున్న నాని ఈ సినిమాతోనూ తన విజయాల పరంపర కొనసాగిస్తాడా? అదేవిధంగా నిర్మాత దిల్ రాజు కూడా వరుస హిట్స్ తో దూసుకుపోతూ ఈ సినిమా తోనూ విజయాన్ని అందుకుంటాడా?దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని అందించింది? మరోసారి సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
రక్తం పంచుకుని పుట్టిన నాని, రాజీవ్ లు అన్నదమ్ములైనప్పటికీ.. వారిద్దరూ మంచి స్నేహితులగా ఉంటారు. ఇద్దరు మధ్యలో ఎటువంటి దాపరికాలు ఉండవు. అన్నదమ్ములిద్దరూ అలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న తరుణంలో రాజీవ్ కి జ్యోతి(భూమిక) తో పెళ్లవుతుంది. రాజీవ్ పెళ్లితో నాని లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఎంజాయ్ చేస్తూ జాలి గా గడుపుతున్న తమ జీవితంలోకి ఆవిడ అంటే వదిన రావడంతో ఆ జాలీ నెస్ పూర్తిగా పోయి.... నాని వదిన మీద పగ పెంచేసుకుంటాడు. అలా ఆవిడ ముందు తిరగలేక నాని తన బాబయ్ ఇంటికి మకాం మారుస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత జ్యోతి కి ఉద్యోగ రీత్యా వరంగల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే రాజీవ్ కి జ్యోతి తో వెళ్లడం కుదరక తన తమ్ముడు నాని ని వదినతో వెళ్ళమని చెబుతాడు. కానీ నాని కి ఆవిడతో వెళ్లడం ఇష్టం లేకపోయినా.. తన అన్నయ్య కోసం కష్టంగా ఆవిడతోపాటే వరంగల్ వెళతాడు. ఇక ఆక్కడ వదినగారి టార్చర్ తో విసిగిపోయిన నాని ని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. స్వయంగా ఆ అమ్మాయి నాని కి లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఆ అమ్మాయే పల్లవి(సాయి పల్లవి). పెళ్లెప్పుడంటూ వెంటపడుతున్న పల్లవిని నాని కూడా ఇష్టపడతాడు. అలాంటి టైం లోనే తన వదిన జ్యోతి... శివ ( విజయ్ వర్మ) వలన చిక్కుల్లో పడడమే కాదు.. ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. ఆ శివ, జ్యోతి ని 10 రోజుల్లో చంపేస్తానని తిరుగుతుంటాడు. మరి జ్యోతికి శివకి మధ్యలో ఉన్న ప్రాబ్లెమ్ ఏమిటి? వదినకొచ్చిన సమస్యను నాని ఎలా సాల్వ్ చేసాడు? అసలు వదిన అంటేనే ద్వేషించే నాని ఆమెని సమస్య నుండి ఎలా బయటపెడేసాడు.? పల్లవి, నాని పెళ్లి చేసుకున్నారా? వంటి ఈ విషయాలన్నీ తెలియాలి అంటే.. వెండితెర మీద నాని - సాయి పల్లవి లు నటించిన ఎంసీఏ... మిడిల్ క్లాస్ అబ్బాయిని చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఎప్పటిమాదిరిగానే నాని నటన అదుర్స్. మరోసారి సహజ నటనతో ఇరగదీసాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాని నటన ఆధ్యంతం అద్భుతః. మిడిల్ క్లాస్ అబ్బాయిలు పడే కష్టాలను నాని తన నటనతో మరింత మెరుగ్గా చూపించాడు. మిడిల్ క్లాస్ కుటుంబాల వాళ్ళు నాని ని స్క్రీన్ మీద చూస్తన్నంత సేపు ఆ కేరెక్టర్ లో తమని తాము ఊహించేసుకుంటారు. ఒక తమ్ముడిగా, మరిదిగా, ప్రేమికుడిగా అని రకాలుగా నాని ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం నాని వన్ మ్యాన్ షో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కూడా. అన్ని వేరియేషన్స్ లో ను అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్నలు పొందుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మలయాళం నుండి వచ్చిన హీరోయిన్ సాయి పల్లవి ఆమెని మలయాళీ అంటే ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే సాయి పల్లవి ఎప్పుడో తెలుగమ్మాయిగా మారిపోయింది. ఫిదా సినిమా లో ఫిదా చేసిన సాయి పల్లవి ఎంసీఏ లోను ఆకట్టుకుంది. డాన్స్ ల విషయం లో మాత్రం సాయి పల్లవి ఇరగదీసింది. నటన విషయం లో మాత్రం అక్కడక్కడా కొన్ని సీన్స్ లో నాని ని ఈజీ గా డామినేట్ చేసింది సాయి పల్లవి. ఇక చాలా కాలం తరువాత మళ్ళి తెలుగు సినిమాలో నటించిన భూమిక తన యాక్టింగ్ తో ఇద్దరు మెయిన్ లీడ్స్ ని డామినేట్ చేసింది. ఈ సినిమాలో జ్యోతి కేరెక్టర్ కి సరిగ్గా సరిపోయింది భూమిక. వదినగా అల్లరిచిల్లరిగా తిరుగుతున్న మరిదిని లైన్ లో పెట్టే పాత్రలో భూమిక మెప్పించింది. అన్నగా రాజీవ్ కనకాల, సాఫ్ట్ వేర్ కంపెనీ బాస్ గా వెన్నెలకిషోర్, నాని స్నేహితుడిగా ప్రియదర్శి, నాని పిన్నిగా ఆమని అందరూ ఆకట్టుకున్నారు.
దర్శకత్వం:
మిడిల్ క్లాస్ అబ్బాయి అని టైటిల్ కి తగ్గట్టే దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాలో మధ్యతరగతి నేపధ్యాన్ని పుష్కలంగా చూపించాడు. ఈ మధ్యతరగతి కుటుంబాలలో ఉండే కష్ట నష్టాలను దర్శకుడు సినిమా మొత్తం చూపించి ఉంటే బావుండేది. కానీ ఫస్ట్ హాఫ్ కే ఈ మిడిల్ క్లాస్ జీవితాన్ని చూపించి సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ మీద నడిపించేసాడు. ఫస్ట్ హాఫ్ లో నాని కి ఫ్రెండ్స్ కి మధ్యన మిడిల్ క్లాస్ నేపధ్యాన్ని ఆకట్టుకునేలా వివరించాడు. అలాగే వదిన మరిది, అన్న ఇలా వచ్చిన సీన్స్ అన్ని ఆకట్టుకునేలా చూపించిన దర్శకడు సెకండ్ హాఫ్ ను కన్విన్సింగా చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. వదిన రాకతో లైఫ్ లో ఎంజాయిమెంట్ పోయిందని ఫిల్ అయ్యే నాని ఆమెని శతృవుగా చూడడం బాగానే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాని వదిన భూమిక చేసిన త్యాగాలకు కరిగిపోయి ఆమెను దేవతలా చూడడం అనేది అస్సలు కన్విన్సింగ్ గా అనిపించదు. యాక్షన్ స్కీన్స్ ని హ్యాండిల్ చేయలేకపోయిన వేణు శ్రీరామ్, లవ్ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేసాడు అనిపించింది. ఇకపోతే సినిమాలో అందరి క్యారెక్టర్స్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ ని బాగా రాసుకున్నాడు వేణు శ్రీరామ్. దర్శకుడు వేణు శ్రీరామ్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా చక్కగా డైరెక్ట్ చేసాడు. అలాగే వదిన టార్చర్ ఒకవైపు, సాయి పల్లవి ప్రేమ మరొకవైపు ఇలా కొన్ని సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సాయి పల్లవి తనకి తానుగా వచ్చి నాని కి ప్రపోజ్ చెయ్యడం కొత్తగా ఉన్నా కూడా నానితో సాయి పల్లవి రొమాన్స్ కొన్ని చోట్ల అసహజంగా అంటే.. సహజసిధ్ధం అనిపించదు. అసలు దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తాన్ని విలన్ కి హీరోకి ఆమధ్య జరిగే మైండ్ గేమ్ తోనే సినిమాని నడిపించేసాడు. అంతేకాకూండా సెకండ్ హాఫ్ లో కామెడీ లేకపోవడం అనేది మరో మైనస్ పాయింట్. రొటీన్ క్లైమాక్స్ తో దర్శకుడు బోర్ కొట్టించినప్పటికీ... కథ, కథనాన్ని చాలా క్లారిటీగా రాసుకోవడమే కాదు... స్క్రీన్ మీద దాన్ని నీట్ గా ప్రెజెంట్ చెయ్యడంలో వేణు శ్రీరామ్ సక్సెస్ అయ్యాడు.
సాంకేతికవర్గం పనితీరు:
దేవిశ్రీ అందించిన సంగీతం ఓ అన్నంత లేకపోయినా కొన్ని పాటలు మూడ్ కి తగ్గట్టుగా ఆకట్టుకున్నాయి. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని మాత్రం దేవిశ్రీ ఇరగదీసాడు. ఎమోషనల్ సీన్స్ అప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వాటికి ప్రాణం పోసాడు. ఇకపోతే ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాని ఎక్కడో కూర్చోబెట్టింది. పాటల్లో కొత్త టెక్నీక్ ఉపయోగించి కళ్ళు చెదిరే విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రవీన్ పూడి ఎడిటింగ్ బాగానే ఉంది అనిపించినా మూవీ సెకండ్ హాఫ్ కి మాత్రం ఇంకా ట్రిమ్మింగ్ అవసరం అనిపించింది. ఇక దిల్ రాజు నిమన విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకూండా ఎంత కావాలో అంటే ఖర్చు పెట్టాడు.
ప్లస్ పాయింట్స్: నాని నటన, సాయి పల్లవి, భూమిక సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్: దర్శకుడు, కథ, కథనం, ఎడిటింగ్, సెకండ్ హాఫ్, కామెడీ తక్కువ కావడం, రొటీన్ క్లైమాక్స్
రేటింగ్: 2.5/5