ఆసక్తికరమైన కథలని ఎంచుకుని మంచి చిత్రాలు తీయాలని అల్లు శిరీష్ ముందుకు వెళుతున్నాడు. ఆ నేపథ్యంలో నేడు ఒక్క క్షణం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు శిరీష్ నేడు వచ్చాడు. టైగర్ - ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి వైవిధ్యమైన సినిమాలను డైరెక్ట్ చేసిన విఐ.ఆనంద్ దర్శకుడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత ఆనంద్, శ్రీరస్తు శుభమస్తు తర్వాత శిరీష్ నటించిన ఒక్క క్షణం ఈ రోజు వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యూఎస్‌లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో షార్ట్ & స్వీట్ రివ్యూలో చూద్దాం.
ఒక జంట ప్రేమకథ...
ఒక్క క్షణం రెండు జంటల సమాంతర జీవితాల మధ్య సాగే కథ. ఓ జంట జీవితంలో జరుగుతున్న సంఘటనలే మరో జంట జీవితంలోనూ జరుగుతుంటాయి. ఈ ఇబ్బందుల నేపథ్యంలో రెండు జంటలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నదే ఈ సినిమాలోని అంశం. ఫస్టాఫ్ వరకు దర్శకుడు తీసుకున్న కాన్సెఫ్ట్ బాగానే ఉన్నా నెరేషన్ స్ట్రాంగ్‌గా లేకపోవడం చాలా మైనస్ అయ్యింది. ఇంటర్వెల్‌లో అదిరిపోయే ట్విస్ట్‌తో దర్శకుడు సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచాడు.
సెకాండాఫ్ థ్రిల్లింగ్....
కీలకమైన సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి. అవసరాల శ్రీనివాస్ రోల్ సినిమాలో చాలా కీలకమైంది. సినిమాకు సెకండాఫ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, నటీనటులు పాత్రలు ప్లస్. ఇక మైనస్‌ల విషయానికి వస్తే ఫస్టాఫ్, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, వెరీ స్లో స్క్రీన్ ప్లే. ఓవరాల్‌గా చూస్తే ఎక్కడికి పోతావు చిన్నవాడా తరహాలోనే వి ఐ ఆనంద్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థ్రిల్లర్ సినిమాలు, డిఫరెంట్ స్టోరీలు ఇష్టపడే వారికి నచ్చుతుంది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్