కోలీవుడ్ నటుడు కార్తీ - రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా పీఎస్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్వెస్ట్‌గేషన్ యాక్షన్ థ్రిల్లర్ ఖాకి. తమిళ్‌తో పాటు కార్తీకి తెలుగులోను మంచి మార్కెట్ ఉండడంతో ఈ సినిమాను రెండు భాషల్లోను ఈ రోజే రిలీజ్ చేశారు. తమిళనాడులో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ / ఏ సర్టిఫికేట్ వచ్చింది. జిబ్రాన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షోల తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుందో ? చూద్దాం.
ఫస్టాఫ్ డీసెంట్ గానే...
ఫస్టాఫ్ విషయానికి వస్తే డీసెంట్‌గా స్టార్ట్ అవుతుంది. కార్తీ ఓ పోలీస్ ఆఫీసర్, అకాడమిలో శిక్షణ తీసుకుంటాడు. హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సిం ఓ విలేజ్ గర్ల్. ఆమెను చూసి మనోడు మనస్సు పాడేసుకుంటాడు. భయంకరమైన నేరస్తుల నిజాలను భయటపెట్టేందుకు కార్తీ చేసే ప్రయత్నాలు, దోపిడీ ముఠా లీడర్‌గా అభిమన్యుసింగ్ ఎంట్రీ, ఆసక్తికరమైన సీన్‌తో ఇంటర్వెల్ కార్డు పడడం జరుగుతుంది.
ఫుల్ యాక్షన్ తో....
ఇక సినిమాకు కీలకమైన సెకండాఫ్ అంతా ఆసక్తిగా ముందుకు సాగుతుంది. విలన్ గ్యాంగ్స్ అండ్ పోలీసుల మధ్య సాగిన సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయనే చెప్పాలి. దర్శకుడు పేపర్ మీద ఎంత క్లీయర్‌గా వర్క్ చేశాడో సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో చక్కగా ఒదిగిపోయాడు. మెయిన్ విలన్‌ను పట్టుకునేందుకు కార్తీ వేసే ఎత్తులు సినిమాకు మెయిన్ ఎస్సెట్. సెకండాఫ్‌లో రాజస్థాన్‌లో వచ్చే సన్నివేశాలు, బస్ చేంజ్ సీన్లు కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగుంది. ఓవరాల్‌గా సెకండాఫ్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఇన్వెస్ట్‌గేషన్ సీన్లతో నడుస్తుంది. ఫుల్ యాక్షన్ మీల్ మూవీయే ఈ ఖాకి.
ప్లస్‌లు (+):
- కార్తీ
- డైరెక్షన్
- సెకండాఫ్
- ఇన్వెస్ట్‌గేషన్ సీన్లు
మైనస్‌లు(-):
- రన్ టైమ్
పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్