నటీనటులు: కార్తీ, నయనతార, శ్రీ దివ్య
మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్
నిర్మాతలు: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, పివిపి బ్యానర్
దర్శకత్వం: గోకుల్
తమిళం తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ని, ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో కార్తీ. సూర్యా తమ్ముడిగా కాకుండా తనకి తానుగా గుర్తింపుని తెచ్చుకుంటూ డిఫరెంట్, డిఫరెంట్ సినిమాలతో ముందుకెళుతున్న కార్తీకి ఇటీవలే వచ్చిన 'ఊపిరి' చిత్రం కొత్త ఊపిరినిచ్చింది. అదే ఊపులో కార్తీ ఇప్పుడు 'కాష్మోరా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ 'కాష్మోరా' చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ లో సంయుక్తం గా నిర్మితమైంది. ఈ చిత్రం గోకుల్ దర్శకత్వం లో తెరకెక్కింది. సోసియో ఫ్యాటాషి మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం 'బాహుబలి' తరహా గ్రాఫిక్స్ తో ఉన్నట్లుగా 'కాష్మోరా' ట్రైలర్స్ లో కనిపించింది. ఇక ఈ చిత్రం లో నయనతార ప్రత్యేక పాత్రలో కనిపించడం... తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గ కార్తీ పక్కన నటించడం.... ఒళ్ళు గగుర్పొడిచే యుద్ధ సన్నివేశాలలో కార్తీ కనిపించడం.... 7 జన్మల ఇతి వృత్తం అనే నేపధ్యం లో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. 7 జన్మల ఇతి వృత్తం అనేది ఈ సినిమా పై స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. మరి ఇంట్రెస్ట్ ప్రేక్షకులు ఈ సినిమాతో ఎలా పొందారనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ: కాష్మోరా ( కార్తీ) కుటుంభం జనాలని మాయ చేస్తూ బ్రతికేస్తూ ఉంటుంది. దెయ్యలతో, భూతాలతో మాట్లాడతామని జనాల్ని నమ్మించి కాష్మోరా కుటుంబ సభ్యులు అందరిని మోసం చేస్తుంటారు. కాష్మోరా కూడా కుటంబం వలె మోసాలు చేస్తూ ఉంటాడు. అతన్ని ప్రజలందరూ గుడ్డిగా నమ్మేస్తుంటారు. అసలు ప్రజలు నమ్మడానికి ఒక బలమైన కారణం ఉంటుంది. అదేమిటంటే ధనకోటి అనే రాజకీయ నాయకుడు ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి అతను కాష్మోరా సహాయం అడుగుతాడు. అనుకోకుండా ఆ కేసునుండి అతను ఎలాగో బయటపడతాడు. కానీ కాష్మోరా శక్తుల వల్లే ధనకోటి బయటపడ్డాడని.... ఇక మహిమగల వ్యక్తిగా కాష్మోరాని జనాలు విపరీతం గ నమ్మడం మొదలెడతారు. ఇదిలా ఉండగా దైవకుమారి ఆలయం లో తాళ పత్ర గ్రంథాలని రాజనాయక్ (కార్తీ) అనే ఆత్మ పక్షి రూపం లో వచ్చి దొంగతనం చేస్తుంది. ఏడు వందల ఏళ్ళ నుండి ఆత్మగా తిరుగుతున్న రాజ్నాయక్ మళ్ళీ జన్మించాలనుకుంటాడు. మళ్ళీ జన్మించాలంటే కాష్మోరా సహాయం అవసరమని ఆ తాళ పత్ర గ్రంథాలలో రాసి ఉంటుంది. మరి రాజా నాయక్ కాష్మోరాని కలుస్తాడా?రాజ్ నాయక్ అనుకున్నది సాధిస్తాడా? అసలు కాష్మోరా కి రాణీ రత్నమహాదేవికి రాజ్ నాయక్ కి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఈ యుద్ధ సన్నివేశాల్లో కాష్మోరా విజయం సాధిస్తాడా? మాటల్ని మంత్రాలని నమ్ముకున్న కాష్మోరాకి రాజా నాయక్ కి ఉన్న సంబంధం ఏమిటనేది తెర మీద వీక్షించాల్సిందే.
పనితీరు: కాష్మోరాగా, రాజనాయక్ గా కార్తీ ఇరగదీశాడనే చెప్పాలి. రెండు పాత్రల్లో కార్తీ నటన ఈ సినిమాకే హైలెట్ గా చెప్పుకోవచ్చు. కాష్మోరా పాత్రలో కార్తీ చేసిన కామెడీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. దర్శకుడు మొదటి భాగాన్ని కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఇక కాష్మోరా చిత్రానికి ఫస్ట్ హాఫ్ ఆయువుపట్టు. మొదటి భాగాన్ని అంతా కామెడీ తో తెరకెక్కించిన దర్శకుడు గోకుల్ సెకండ్ హాఫ్ లో హర్రర్ ని పరిచయం చెయ్యాలనుకున్నాడు. కానీ సోసియో ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకి మైనస్ గా చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అంతా బాగా సాగదీసి లెన్త్ పెంచేసి బోర్ కొట్టించేసాడు. అయితే కార్తిలోని నటన ని దర్శకుడు బాగానే క్యాష్ చేసుకున్నాడు. కార్తిలోని నటన సామర్ధ్యాన్ని వెలికి తీసాడు. ఇక నయనతార రాణీ రత్నమహాదేవి పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. కానీ హీరోయిన్ గా చేసిన శ్రీ దివ్యని పెద్దగా వాడుకోలేదు దర్శకుడు. ఆమెని చిన్న పాత్రకే పరిమితం చేసాడు. ఈ సినిమాకి బ్యాగ్ రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. కానీ పాటలకి పెద్దగా స్కోప్ లేదు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. ఇక కాష్మోరా చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా డ్రీమ్ వారియర్స్, పివిపి నిర్మించారు. నిర్మాణ విలువలుబాగున్నాయి .
ప్లస్ పాయింట్స్: కార్తీ నటన, దర్శకత్వం, కామెడీ, ఫస్ట్ హాఫ్, బ్యాగ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్
మైనస్ పాయింట్స్, బలమైన కథ, కథనం, సెకండ్ హాఫ్, పాటలు, రిపీటెడ్ సీన్స్
రేటింగ్: 2.5/5