క‌ళ్యాణ్‌రామ్ ' ఎమ్మెల్యే ' స్వీట్ & షార్ట్ రివ్యూ

Update: 2018-03-23 04:21 GMT

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ఇజం త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎమ్మెల్యే, నా నువ్వే సినిమాల్లో న‌టించాడు. పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా, ఉపేంద్ర మాధ‌వ్ అనే కొత్త ద‌ర్శకుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రీమియ‌ర్లు కంప్లీట్ అయ్యాయి. ప్రీమియ‌ర్ల ప్రకారం ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉందో షార్ట్ రివ్యూలో ఓ లుక్కేద్దాం.

కథా పరంగా.....

క‌థా ప‌రంగా చూస్తే హీరో క‌ళ్యాణ్‌రామ్ త‌న బావ వెన్నెల కిషోర్ కోసం బెంగ‌ళూరు వెళ‌తాడు. అక్కడ హీరోయిన్ కాజ‌ల్‌ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే అక్కడ విల‌న్ వ‌ల్ల హీరోయిన్ ప్రమాదంలో ఉంద‌ని తెలుసుకుంటాడు. ఆమెను కాపాడుకునేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి విల‌న్‌కు యాంటీగా నామినేష‌న్ వేస్తాడు. అక్కడ క‌ళ్యాణ్ చేసిన మంచి ప‌నులు అత‌డిని ఎన్నిక‌ల్లో గెలిపించాయా ? చివ‌ర‌కు హీరోయిన్‌ను విల‌న్ భారీ నుంచి ఎలా కాపాడాడు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.

కొత్తదనమేమీ లేకపోయినా.....

క‌థా ప‌రంగా చూస్తే ఎమ్మెల్యే కొత్తగా ఉండ‌దు. రొటీన్ స్టోరీయే. అయితే ద‌ర్శకుడు క‌థ‌ను న‌డిపించిన తీరు బాగుంది. కొన్ని చోట్ల ట్రీట్‌మెంట్ కొత్తగా ఉన్నా... మ‌రికొన్ని సీన్లు మాత్రం రొటీన్‌గానే ఉన్నాయి. ఫ‌స్టాఫ్‌లో వెన్నెల కిషోర్ - క‌ళ్యాణ్‌రామ్ మ‌ధ్య కామెడీ ట్రాక్‌తో పాటు కాజ‌ల్ - క‌ళ్యాణ్ మ‌ధ్య ల‌వ్ సీన్లు బాగున్నాయి. క‌ళ్యాణ్‌రామ్ సినిమాను త‌న భుజాల మీద వేసుకుని న‌డిపించాడు. హీరోయిన్ కాజ‌ల్ త‌న గ్లామ‌ర్ లుక్‌తో ఎప్పటిలాగానే మెప్పించేందుకు ట్రై చేసింది. ఇటీవ‌ల వ‌రుస‌గా ప్లాప్ అవుతోన్న బ్రహ్మానందం లాయ‌ర్ ప‌ట్టాభిగా ఈ సారి మెప్పించాడు. వెన్నెల కిషోర్‌, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ కామెడీ బాగా వ‌ర్కవుట్ అయ్యింది. సెకండాఫ్‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లు కూడా బాగా క‌నెక్ట్ అయ్యాయి.

పేలిన డైలాగులు....

సినిమాలో యాక్షన్ పార్టు హైలెట్‌. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగులు బాగా పేలాయ్‌. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ సోసో. పాట‌లే రెండు బాగున్నాయనుకుంటే అవి కూడా రాంగ్ ప్లేస్‌మెంట్‌లో వ‌చ్చాయి. ఇక రొటీన్ స్టోరీ మైన‌స్‌. అయినా ఓవ‌రాల్‌గా మాత్రం ద‌ర్శకుడు ఉపేంద్ర మాధ‌వ్ తొలి ప్రయ‌త్నంలోనే స‌క్సెస్ అయ్యాడు. క్లాస్‌ను మెప్పించే కొన్ని సీన్లు, ఓవ‌రాల్‌గా మాస్‌ను మెప్పించే సినిమాగా ఎమ్మెల్యే నిలుస్తుంది. మ‌రి కొద్ది సేప‌ట్లోనే పూర్తి రివ్యూతో క‌లుద్దాం.

Similar News