నటీనటులు: వెంకటేష్, రితిక సింగ్, నాజర్, తనికెళ్ళ భరణి, రఘుబాబు
సంగీతం: సంతోష్ నారాయణ్
నిర్మాత: శశికాంత్
దర్శకత్వం: సుధా కొంగర
ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయిన సీనియర్ హీరో వెంకటేష్ ఎప్పుడూ కూడా కొత్త తరహా చిత్రాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ హిట్స్ కొట్టుకుంటూ పోతున్న ఆయన మొదటిసారి బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్న చిత్రం 'గురు'. వెంకటేష్ పలు భాషల్లో హిట్ చిత్రాలను రీమేక్ చేస్తూ పోతూ తెలుగులో సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇక ఇపుడు కూడా సూపర్ హిట్ చిత్రం 'సాల ఖడూస్' చిత్రానికి రీమేక్ గా 'గురు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో బాక్సర్ గా కోచ్ గా వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఆకట్టుకున్నాడు. ఇక డైరెక్టర్ సుధా కొంగర 'సాల ఖడూస్' చిత్రాన్ని తానె డైరెక్ట్ చేసింది... కాబట్టి తెలుగు వెర్షన్ కి కూడా ఆమె డైరెక్టర్ అవడం ఈ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ వుంది. 'సాల ఖడూస్' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి దగ్గరగా రీమేక్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని సుధా కొంగర ప్రయత్నంగా చెప్పొచ్చు. అలాగే ఎప్పుడూ రీమేక్స్ తో హిట్స్ కొట్టే వెంకటేష్ ఈసారి కూడా హిట్ కొడతాననే కాన్ఫిడెంట్ తో కనిపించడం.... గురు చిత్రం కోసం వెంకటేష్ తన గొంతుని సవరించి ఒక పాటపాడడం వంటి అంశాలు.... వెంకటేష్ గురు ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. పదండి ఆ అంచనాలను గురు అందుకుంటాడో? లేదో? సమీక్షలో తెలుసుకుందాం.
కథ: ఆదిత్య రావు (వెంకటేష్) బాక్సర్. ఆదిత్య కు విపరీతమైన కోపం. ఆ కోపం వల్ల ఆదిత్య రావు జీవితంలో చాలా నష్ట పోతాడు. ఆ కోపం మూలంగా, బాక్సింగ్ అకాడమీలో పేరుకుపోయిన అవినీతి రాజకీయాలవల్ల ఆదిత్యా బాక్సింగ్ కెరీర్ కి మద్యలోనే ఫుల్ స్టాప్ పడుతుంది. తర్వాత బాక్సింగ్ అకాడమీలో కోచ్ గా చేరిన ఆదిత్య ని వైజాగ్ లోని లేడీస్ బాక్సింగ్ అకాడమీకి పంపిస్తారు. అక్కడ ఒక అమ్మాయిని చూసి ఆమెలోని ప్రతిభని గుర్తించి ఆమెకి బాక్సింగ్ లో కోచింగ్ ఇవ్వాలని అనుకుంటాడు ఆదిత్య. కానీ ఆమె కూరగాయలు అమ్ముకుంటూ బ్రతుకు వెళ్లదీస్తుంటుంది. ఆమె పేరు రాముడు( రితిక సింగ్). కానీ ఆమెకి బాక్సింగ్ మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు. అయితే డబ్బులు వస్తే జీవితం బాగుపడుతుందని అనుకుని కేవలం డబ్బుకోసం బాక్సింగ్ నేర్చుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆమెకు ఆదిత్య 'గురు' అంటే అస్సలు ఇష్టముండదు. ఆ కారణంగానే రాముడు మ్యాచ్ లన్ని ఓడిపోతూ గురూ కి కోపం తెప్పిస్తుంటుంది. మరి గురు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆమెకి సరైన శిక్షణ ఇవ్వగలిగాడా? ఆమె బాక్సర్ గా విజయాన్ని అందుకోగలుగుతుందా? అసలు రాముడికి గురు మీద ఎందుకంత కోపం? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'గురు' చిత్రాన్ని ఖచ్చితంగా వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ తో సూపర్ గా ఆకట్టుకున్నాడు. లుక్స్ తో చంపేశాడు. గురు పాత్రకి వెంకటేష్ చక్కగా సరిపోయాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని గురు పాత్రకి వెంకటేష్ న్యాయం చేసాడనే చెప్పాలి. కోచ్ గా బాక్సర్ గా బడి లాంగ్వేజ్ తో వెంకటేష్ 100 శాతం సక్సెస్ అయ్యాడు. గురు చిత్రం కోసం వెంకటేష్ చాలా శ్రమపడినట్లు తెలుస్తుంది. అవినీతి రాజకీయాలకు చెక్ చెప్పే పాత్రలో వెంకటేష్ అతికినట్లు సరిపోయాడు. చివరివరకు లుక్స్ తోనే వెంకటేష్ సినిమాని నడిపించాడంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. అలాగే హీరోయిన్ రితిక సింగ్ కూడా చాల సహజ సిద్ధ నటనతో ఆకట్టుకుంది. నిజ జీవితంలో బాక్సర్ అయిన రితిక సింగ్ రాముడు పాత్రకి పూర్తి న్యాయం చేసింది. డీ గ్లామర్ గా కూడా ఆమె నటన అద్భుతం. ఇక నాజర్, తనికెళ్ళ భరణి మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు: దర్శకురాలు సుధా కొంగర చాలా మంచి కథను తీసుకుని సాలా ఖడూస్ ని చిత్రం గా మలిచింది. అదే చిత్రాన్ని తెలుగులో గురు గా రీమేక్ చేసింది. తెలుగు నేటివిటీకి దగ్గరగా రాలేకపోయినా కానీ తెలు ప్రేక్షకులను గురు చిత్రం ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ఈ చిత్రం లో ఎక్కువగా తెలుగు నటీనటులు లేకపోవడం... ఒక డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగినా కూడా తెలుగు ప్రేక్షకులు దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వెంకటేష్ అద్భుతమైన నటన బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకి చిన్న మైనస్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తగ్గాయి. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ చిత్రం సాలా ఖండూస్ ని ఉన్నది ఉన్నట్లుగా చిన్న చిన్న మార్పులతో తెలుగులో దించేసింది సుధా కొంగర. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం ప్రాణం పోసిందని చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి వెన్నుముక గా పని చేసింది. వెంకటేష్ పాడిన పాట మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్హ పెడితే బావుండేదనిపించింది. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునేలా వుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్: వెంకటేష్ నటన, లుక్, రితిక సింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్: కామెడీ, ట్విస్ట్స్ లేకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ కి ప్రాధాన్యత తగ్గించడం