జ‌య‌ జాన‌కి నాయ‌క మూవీ రివ్యూ

Update: 2017-08-11 15:21 GMT

న‌టీన‌టులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్‌, కేథ‌రిన్, సుమ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్‌కుమార్‌, వాణీ విశ్వ‌నాథ్

సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

నిర్మాత‌: మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి

డైరెక్టర్: బోయపాటి శ్రీను

ఒకపక్క మాస్ ఎలిమెంట్స్ మరో పక్క కుటుంబానికి పెద్ద పీట వేస్తూ టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న బోయపాటికి మాస్ డైరెక్టర్ గా మంచి ట్రాక్ రికార్డ్ వుంది. మాస్ మాసాలకు అంద‌మైన ఫ్యామిలీని జ‌త‌చేసి ఒక క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని చెయ్యడంలో బోయ‌పాటి శ్రీను తనకు తనే సాటి. ఎప్పుడూ టాప్ హీరోస్ తో సినిమాలు చేస్తూ వస్తున్న బోయపాటి ఈసారి ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఒక సినిమాని చేసాడు. కాకపోతే 'జయ జానకి నాయక' టైటిల్ ని మాత్రం బోయపాటి చాలా సాఫ్ట్ గా పెట్టేసరికి అందరూ బోయపాటి మాస్ మిస్సవుతున్నామేమో అనే ఫీల్ లోకి వెళ్లిపోయారు. 'జయ జానకి నాయక' టైటిల్ మాత్రమే సాఫ్ట్ మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ పక్కా మాస్ మసాలా చిత్రమని ట్రైలర్స్ లో అర్ధమయ్యేటట్టు చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేసాడు బోయపాటి. శ్రీనివాస్ ని పక్కా మాస్ గా చూపిస్తూనే మరోపక్క క్లాస్ కుర్రాడిగా చూపెట్టాడు బోయపాటి. ఇక ఈ 'జయ జానకి నాయక' మరో మెయిన్ హైలెట్ టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించడం. ఈసారి రకుల్ గ్లామర్ స్టయిల్ మార్చి సాఫ్ట్, కూల్ అమ్మాయిలా కనిపించింది. మరో హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్ గ్లామర్ కూడా ఈసినిమాకి కలిసొచ్చే పాయింట్. ఇక మరో హీరోయిన్ కేథరిన్ 'జయ జానకి నాయక' లో ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ లో నటించడం ఈ సినిమాకి మరో హైలెట్. మరి బోయపాటి మార్క్ మాస్, బెల్లంకొండ తో పలికించిన భారీ డైలాగ్స్ ఈ చిత్రాన్ని ఎంతవరకు సక్సెస్ చేశాయి. హీరోయిన్స్ గ్లామర్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయం సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఇండస్ట్రీయలిస్ట్ అయిన చ‌క్ర‌వర్తి (శ‌ర‌త్‌కుమార్‌)కి ఇద్దరు కొడుకులు, ఒకరు (నందు), మరొకరు గగన్(సాయి శ్రీనివాస్) లు. చక్రవర్తి కొడుకులతో ఎంతో స్నేహంగా ఉంటూ.... వారు ఎలాంటి మంచి పని చేసినా వారికి సపోర్ట్ చేస్తుంటాడు. ఒకసారి సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ (సుమ‌న్‌) కుమారుడు కాలేజీలో అల్ల‌రి చేస్తుంటాడు. అతని అల్లరి భరించలేక కాలేజ్ లో ఒక అమ్మాయి ఆ కాలేజ్ వదిలి వెళ్ళైపోవాలని డిసైడ్ అయ్యి టీసీ తీసుకుంటుంది. కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ గా స్వీటీ (ర‌కుల్ ప్రీత్‌సింగ్) నిలబడుతుంది. అది తట్టుకోలేని ఆ మినిష్టర్ కొడుకు స్వీటీని కూడా అల్లరి చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో స్వీటీని ఆ మినిష్టర్ కొడుకు నుండి గగన్ రక్షిస్తాడు. గగన్ కి తోడుగా గగన్ అన్న, తండ్త్రి చక్రవర్తిలు నిలబడతారు. మరి మినిష్టర్ తో పెట్టుకుంటే ఆయనూరుకుంటాడా. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని చక్రవర్తి మీద ఆయన కొడుకుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అలాంటి సమయంలో మినిస్టర్, అశ్వ‌త్ నారాయ‌ణ వ‌ర్మ (జ‌గ‌ప‌తిబాబు) ఇంట్లో జరిగే అతని కుటుంబ వేడుక‌కు హాజ‌ర‌వుతాడు. అశ్వ‌త్ నారాయ‌ణ వ‌ర్మ పరువుకు ప్రాణాలు తీసే రకం. మరోపక్క లిక్క‌ర్ బిజినెస్‌లో ఉన్న పవార్, డైమండ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ విషయంలో అశ్వ‌త్ నారాయ‌ణ వ‌ర్మ తో గొడవకు దిగుతాడు. పవార్ కి అశ్వ‌త్ నారాయ‌ణ వ‌ర్మ కి మధ్యలో స్వీటీ ఇరుక్కుంటుంది. స్వీటీ విషయంలో తన తండ్రి చక్రవర్తి కి ఇచ్చిన మాట ప్రకారం వారి ఇద్దరినుండి స్వీటీని కాపాడడానికి గగన్ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అసలు సెంట్రల్ మినిష్టర్ ఏమయ్యాడు? అతను చక్రవర్తి ఫ్యామిలీపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అశ్వ‌త్ నారాయ‌ణ వ‌ర్మ కి పవార్ కి ఉన్న పగ ఏమిటి? వాళ్ళ మధ్యలోకి స్వీటీ వెళ్లాల్సిన అవసరం ఏమిటి? వారిద్దరినుండి స్వీటీని గగన్ రక్షించగలిగాడా? తన తండ్రి చక్రవర్తికి ఇచ్చిన మాట గగన్ కాపాడుకోగలడా? అనేది మాత్రం వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పాత్ర:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన గత చిత్రాల కంటే 'జయ జానకి నాయక' చిత్రంలో నటన పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఒక పక్క కుటుంబానికి విలువనిస్తూనే... ప్రేమించే అమ్మాయి కోసం పోరాడే యువకుడిలా బెల్లంకొండ అద్భుతమైన నటన కనబర్చాడు. ఇక డాన్స్ విషయంలోనూ, ఫైట్స్ విషయంలోనూ బెల్లంకొండ శ్రీనివాస్ కొంచెం మెరుగుపడ్డాడు. పక్కా మాస్ కుర్రాడిగా కనిపిస్తూనే అదేటైం లో క్లాస్ యువకుడిగా కూడా ఆకట్టుకున్నాడు. బెల్లంకొండ పవర్ ఫుల్ డైలాగ్స్ ని చెప్పడంలో విఫలమయ్యాడు. డైలాగ్ డెలివరీలో బెల్లంకొండ ఆకట్టుకోలేక చతికిలపడ్డాడనే చెప్పాలి. బెల్లంకొండ పెరఫార్మెన్సు లో 100 శాతం సక్సెస్ అవ్వకపోయినా మంచి మార్కులే పడ్డాయి అతని నటనకు. ఇక 'జయ జానకి నాయక' చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఈ చిత్రంలో రకుల్ నటన సినిమాకే హైలెట్. అద్భుతమైన నటన కనబర్చి నూటికి నూరు శాతం మార్కులు కొట్టేసింది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో రకుల్ అదరగొట్టేసింది. అల్లరిపిల్లగా, డిప్రెష‌న్‌కు గురైన అమ్మాయిలా రకుల్ నటన అత్యంత అద్భుతమనే చెప్పాలి. ఇక మరో హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్ అందాల ఆరబోత లో రెచ్చిపోయి నటించింది. అలాగే కేథరిన్ హాట్ హాట్ ఐటెం సాంగ్ కూడా సినిమాకి ప్రధానమైన హైలెట్. కేథరిన్ ఆ ఐటమ్ సాంగ్ లో వర్షంలో తడి తడి అందాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది. తండ్రిగా శ‌ర‌త్‌కుమార్‌.... అన్న‌గా నందు చ‌క్క‌గా తమ తమ పాత్రల్లో మెప్పించారు. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా.... కూతురి విష‌యంలో స్వార్థ‌ప‌రుడిగా జె.పి. నటన కూడా బావుంది. ఇక ప‌రువు కోసం పాకులాడే రిచ్ మేన్‌గా జ‌గ‌ప‌తిబాబు మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక సుమన్ సెంట్రల్ మినిష్టర్ గా ఆకట్టుకున్నాడు. కానీ ఇలాంటి పాత్రల్లో సుమన్ ఇదివరకే నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ పాయింట్ సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాధ్ ఒక కీలక పాత్రలో నటించిమెప్పించింది. మిగతా నటీనటులు తమపరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

బోయపాటి ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నీ మాస్ ని నమ్ముకుని చేసిన సినిమాలే. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన 'జయ జానకి నాయక' చిత్రం కూడా పూర్తి యాక్షన్ ఎంటర్టైనరే. సినిమా స్టార్టింగ్ నుండి చివరివరకు సినిమా మొత్తం పూర్తిస్థాయి మాస్ ఎలెమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. బెల్లంకోండని కేవలం యాక్షన్ సీన్స్ కోసం, డాన్స్ ల కోసమే డైరెక్టర్ వాడాడా అనిపిస్తుంది. బోయపాటి సినిమాల్లో కథకు చోటులేకపోయినా యాక్షన్ తోనే సినిమా అంతా నడిపించగల సత్తా ఉన్న డైరెక్టర్ బోయపాటి. బోయపాటి 'జయ జానకి నాయక' కోసం ఎంతోమంది సీనియర్ నటులను తీసుకున్నాడు. అంతమందిని తీసుకున్న ఎవరకి ఎంత ప్రాధాన్యతనివ్వాలి అంటే ప్రాధాన్యతనిస్తూ సినిమాని నడిపించాడు. కొన్నిచోట్ల లాజిక్ లు మిస్ అయినా కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయగలిగాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ బోయపాటి పవర్ ఫుల్ డైలాగ్స్. ఎక్కువ డైలాగ్స్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అవ్వడం ఖాయం. జయ జానకి నాయక సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ తనదయిన స్టయిల్ ల్లో ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా వున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ 'జయ జానకి నాయక' సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. అంతబాగా ఇచ్చాడు బ్యాగ్రౌండ్ స్కోర్. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. కొంచెం సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి కత్తెర వేస్తె బావుండేది. ఇక 'జయ జానకి నాయక'కి మరో ఆకర్షణ సినిమాటోగ్రఫీ. సినిమాలోని సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టు అందంగా చూపించారు. ఇక డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని ఆసక్తిగా నడిపించి ఆకట్టుకున్నాడు. నిర్మాణత్మక విలువలు బాగున్నాయి.ఇక ఈ చిత్రం బిసి సెంటర్స్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. బోయపాటి మార్క్ డైలాగ్స్ కి కొదవ లేకుండా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మీరు బోయపాటి కోసం ఒకసారి చూడొచ్చు.

ప్లస్ పాయింట్స్: శ్రీనివాస్ డాన్స్, ఫైట్స్, రకుల్ నటన, ప్రగ్యా అందాల ఆరబోత, కేథరిన్ గ్లామర్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, స్క్రీన్ ప్లే, కథనం, డైరెక్టర్, మాస్ ఎలిమెంట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్: శ్రీనివాస్ నటన, కథ, ట్విస్టులు లేకపోవడం, ఎడిటింగ్

రేటింగ్: 2.75/5

Similar News