మెగా మేనళ్లుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లతో దూసుకుపోయింది. సాయి మీడియం రేంజ్ హీరోగా ఎదగడానికి చాలా తక్కువ టైం తీసుకున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ - సుప్రీమ్ సినిమాలు వరుసగా హిట్లు అయ్యాయి. ఆ తర్వాత సాయి ఎంచుకునే కథలతో వరుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. విన్నర్ - తిక్క - నక్షత్రం సినిమాలు ఫల్టీ కొట్టాయి.
ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని సాయి ప్రముఖ రచయిత బీవీఎస్.రవి దర్శకత్వంలో సోషల్ కంటెంట్‌తో జవాన్ సినిమా చేశాడు. కొద్ది రోజులుగా వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమా ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి దిగనుంది. గురువారం రాత్రే జవాన్ ప్రీమియర్ షోలు అటు ఓవర్సీస్‌లోను, హైదరాబాద్‌లోను ప్రదర్శించారు. ప్రీమియర్ షో టాక్ తర్వాత సినిమా ఎలా ఉందో షార్ట్ రివ్యూలో చూద్దాం.
కథలో దర్శకుడు తీసుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. మిసైల్ నేపథ్యంలో రాసుకున్న కథ, ఈ కథ చుట్టూ దర్శకుడు హీరో - విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ వార్‌తో అల్లుకున్న స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా ఉంది. సినిమా అంతా యాక్షన్ నేపథ్యంలోనే ఉండడంతో యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్ అయ్యాయి. మిస్సైల్‌కు సంబంధించిన సీన్లు, ఛేజింగ్ సీన్లు ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి.
హైలెట్స్ విషయానికి వస్తే సెకండాఫ్‌లో వచ్చిన సీన్లు సినిమాను మరో మెట్టెక్కించాయనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు రిచ్‌లుక్ తీసుకువచ్చింది. సాయి ఎప్పటిలాగానే డ్యాన్సులు, ఫైట్లలో తన ఎనర్జీతో దుమ్మురేపాడు. హీరోయిన్ మెహ్రీన్ అందంగా ఉండి ఆకట్టుకుంది. విలన్ ప్రసన్న తన పాత్రకు న్యాయం చేశాడు.
మైనస్‌ల విషయానికి వస్తే పూర్తిగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో సాగిన జవాన్ కథలో కొంచెం పాటలు రాంగ్ ప్లేస్‌మెంట్‌లో వచ్చి ఇబ్బంది పెట్టాయి. అయితే కంప్లీట్ యాక్షన్ ఫార్మాట్‌లో సాగిన ఈ సినిమా మిగిలిన వర్గాల ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో ? చూడాలి. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్