మాస్ మహరాజ్ రవితేజ రెండేళ్ల గ్యాప్ తర్వాత గతేడాది చివరలో రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. ఆ సినిమాతో పాటే స్టార్ట్ అయిన టచ్ చేసి చూడు ముందుగా సంక్రాంతి బరిలో నిలిచినా కాస్త లేట్‌గా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. రవితేజ కెరీర్‌లో పవర్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు రవితేజ కూడా పవర్ ఫుల్ ఆఫీసర్‌గా నటించిన టచ్ చేసి చూడు సినిమాలో రాశీఖన్నా, సీరత్‌కపూర్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇప్పటికే ప్రీమియర్లు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో షార్ట్ & స్వీట్ రివ్యూలో చూద్దాం.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటన బాగుంది. రాశీఖన్నా డ్యాన్సర్‌గా, సీరత్‌కపూర్ రవితేజ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా నటించారు. మురళీశర్మ డీజీపీగా నటించాడు. ఫస్టాఫ్ వరకు చూస్తే సినిమా డీసెంట్ గానే సాగింది. హీరోయిన్లతో రెండు మూడు రొమాంటిక్ సీన్లు, మూడు సాంగ్స్ పిక్చరైజేషన్ వరకు ఓకే. ప్లాట్ నరేషన్‌తోనే నడిచిన ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక్కటే హైలెట్. ఇక్కడ వచ్చిన ట్విస్ట్‌తోనే సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి.
సెకండాఫ్ విషయానికి వస్తే ఫస్టాఫ్‌లో ఏమీ లేదనుకుంటే దానికంటే కొంచెం బెటర్ అంతే. టచ్ చేసి చూడును యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చెప్పినా దర్శకుడు రవితేజ మార్క్ యాక్షన్‌తో పాటు కామెడీ మిస్ చేసేశాడు. ఇక కథాపరంగా చూసినా బలహీనమైందే కావడం ఈ సినిమాకు మరో మేజర్ మైనస్ పాయింట్. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఫైట్లు మాత్రం యాక్షన్ ప్రియులను మెప్పిస్తాయి. 147 నిమిషాల రన్ టైం కూడా సినిమాలో చాలా సీన్ల సహనానికి పరీక్షగా మారింది.
ప్లస్‌లు (+):
- రవితేజ ఎనర్జిటిక్ నటన
- హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు
- ఫస్టాఫ్‌తో పోలిస్తే మెరుగైన సెకండాఫ్
- ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్‌లు(-):
- బలహీనమైన స్టోరీ
- ఫస్టాఫ్
- ఎడిటింగ్
ఫైనల్‌గా....
రాజా ది గ్రేట్ లాంటి హిట్ తర్వాత రవితేజ చేసిన ఈ సినిమా రవితేజ కెరీర్‌లో బలహీనమైన కథాంశంతో వచ్చిన సినిమాల్లో ఒకటి. ఈ వీక్ కంటెంట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.28 కోట్ల షేర్ రాబట్టడం కష్టమే. ఈ సినిమాకు పోటీగా వచ్చిన ఛలో సినిమాకు హిట్ టాక్ రావడంతో పాటు వచ్చే వారం ఇంటిలిజెంట్, తొలిప్రేమ లాంటి సినిమాలు ఉండడంతో టచ్ చేసి చూడు బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కడం కాస్త కష్టమే. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్