డీజే.... దువ్వాడ జగన్నాథం మూవీ రివ్యూ - 2

Update: 2017-06-23 08:55 GMT

నటీనటులు: అల్లు అర్జున్, పూజ హెగ్డే, రావు రమేష్, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ‌త్రు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

నిర్మాత: దిల్ రాజు

డైరెక్టర్: హరీష్ శంకర్

టాలీవుడ్ లో ఫుల్ ఎనెర్జీతో... డాన్స్ లతో, నటనతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని.... మంచి కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్ కొడుతున్న మెగా హీరో అల్లు అర్జున్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 'రేసుగుర్రం'లా దూసుకుపోతున్నాడు. గత ఏడాది 'సరైనోడు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇపుడు 'గబ్బర్ సింగ్' వంటి హిట్టిచ్చి... 'రామయ్యా వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్' వంటి యావరేజ్ హిట్స్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'డీజే దువ్వాడ దువ్వాడ జగన్నాథం' గా బాక్సాఫీస్ ని దున్నేయ్యడానికి వచ్చేసాడు. 'బాహుబలి' వంటి పెద్ద సినిమా బాక్సాఫీస్ ని కొల్లగొట్టిన తర్వాత మధ్యలో చిన్న సినిమాలు ఎన్నో వచ్చి వెళ్లాయి. కానీ ఇప్పుడు 'బాహుబలి' తర్వాత పెద్ద చిత్రంగా 'డీజే' బాక్సాఫీస్ మీద దండయాత్రకు దిగింది. బ్రాహ్మణుడిగా మంత్రాలు గట్రా వల్లిస్తూ... మంచి కామెడీ టైమింగ్ తో హీరోయిన్ పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తూ.... 'డీజే దువ్వాడ జగన్నాథం' అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అల్లు అర్జున్ మాస్ మాసాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్ధపడిపోయాడు. గ్లామర్ డాల్ పూజ హెగ్డే అందాల ఆరబోత ఈ డీజే చిత్రానికి మరో ప్రధానమైన ఆకర్షణ. అలాగే 'అ... ఆ' చిత్రంలో కామెడీ విలన్ గా మెప్పించిన రావు రమేష్ 'డీజే' చిత్రంలో రొయ్యలనాయుడు గా విలనిజాన్ని పండించనున్నాడు. ఇకపోతే మనం ట్రైలర్స్ లో చూసినదాన్ని బట్టి అల్లు అర్జున్ ఇందులో రెండు విభిన్నమైన కేరెక్టర్స్ చేస్తున్నాడనిపిస్తుంది. ఒకటి హాస్య బ్రాహ్మణుడిగాను, మరొకటి ఫుల్ యాక్షన్ కేరెక్టర్ లోను అల్లు అర్జున్ కనబడతాడనిపిస్తుంది. అయితే ఇందులో బన్నీ డ్యూయెల్ రోలా లేకపోతె రెండు వేరియేషన్స్ ఉన్న పాత్ర అనేది మాత్రం కాస్త కన్ఫ్యూషనే. డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఈసారి హిట్ కంపల్సరీ. 'డీజే' చిత్రం హిట్టయితేనే మనోడికి టాలీవుడ్ లో పెద్ద ప్రాజెక్టులు చేతిలోకి వస్తాయి. ఇక నిర్మాత దిల్ రాజుగారు కథను నమ్మే సినిమాలు నిర్మిస్తాడు. తన తెలివితేటలతో సినిమా విజయాన్ని డిసైడ్ చెయ్యగల మేధావిగా దిల్ రాజుకి పేరుంది. అంతేకాకుండా దిల్ రాజు కెరీర్ లో ఇప్పటివరకు 24 సినిమాలను నిర్మించాడు. ఇప్పుడు తన 25 వ చిత్రం అల్లు అర్జున్ తో డీజే చిత్రాన్ని తీసాడు. సో ఈ లెక్కన దిల్ రాజు కి ఈ డీజే విజయం సాధిస్తే ఆ విజయం ఎప్పటికి గుర్తుండిపోతుందన్నమాట. మరి దిల్ రాజు నమ్మిన ఈ డీజే చిత్రం అల్లు అర్జున్ కి, దిల్ రాజుకి హ్యాట్రిక్ హిట్ ని అందిస్తుందా? అలాగే దేవీశ్రీ అద్భుతమైన మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పూజ, అల్లు అర్జున్ డాన్సుల్లో ఇరగదీశారని ప్రోమోస్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక భారీ పెట్టుబడి ఎంతో ఆర్భాటంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాటలోని కొన్ని పదాలు, కొన్ని సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం, వారి వ్యతిరేఖత వంటి అంశాలతోనే బీభత్సమైన పబ్లిసిటీ సొంతం చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక పక్కా కమర్షియల్ గా తెరకెక్కిన ఈ డీజే చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్) అనే శాస్త్రి సత్యనారాయణ అగ్రహారంలో మంచి వంటవాడిగా వుంటాడు. వంటవాడిగా పనిచేస్తూనే సమాజంలో జరిగే అన్యాయాలపై రహస్యంగా పోరాడుతుంటాడు. ఆ క్రమంలోనే డీజే గా తాను అనుకున్న పనులు చేస్తూ ఉంటాడు. మరోపక్క శాస్త్రిగా వంటవాడిగా ఫంక్షన్స్ కి కేటరింగ్ లు చేస్తుంటాడు. అలా శాస్త్రి కేటరింగ్ చేసిన ఫంక్షన్ లో పూజ (పూజ హెగ్డే) ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఫ్యాషన్ డిజైనర్ పూజా కూడా శాస్త్రి ప్రేమలో తడిచి ముద్దవుతుంది. అగ్రహారంలో ఈ ప్రేమ, వంట పనులు చక్కబెడుతూనే మరో పక్క డీజే గా తాను టార్గెట్ చేసిన ఒకొక్కర్నీ చంపేస్తాడు. అందులో భాగంగానే భారీ స్కామ్ కి మూలమైన రొయ్యల నాయుడు (రావు రమేష్)తో కయ్యానికి కాలుదువ్వుతాడు డీజే. ఇక రొయ్యలనాయుడు కూడా డీజే ని మట్టుబెట్టే క్రమంలో డీజే రూపంలో ఉన్న దువ్వాడ జగన్నాథం శాస్త్రిని చంపబోతాడు. అసలు దువ్వాడ శాస్త్రి డీజే గా ఎందుకు మారాలనుకుంటాడు? బ్రాహ్మణ యువ‌కుడు హ‌త్యలు ఎందుకు చేయాలనుకుంటాడు.? శాస్త్రిగా పూజ ని పెళ్లి చేసుకోగలుగుతాడా? అసలు రొయ్యలనాయుడుకి డీజే కి మధ్య ఉన్న గొడవకి కారణం ఏంటి? ఈ గొడవల్లో శాస్త్రి ప్రేమ ఏమవుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా డీజే చిత్రాన్ని వెండితెర మీద వీక్షించాల్సిందే.

డీజే సినిమా మొత్తం అల్లు అర్జున్ వన్‌మేన్ షో. సినిమా అంతటిని అల్లుఅర్జున్ భుజాలపైనే నడిపించడానడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎప్పటిలాగే తన ఎనర్జీతో, నటనతో.... ఇరగదీసేసాడు. ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన ప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలనే చేస్తూ వచ్చాడు. ఇందులోనూ అంతే. కాకపోతే శాస్త్రి రోల్ మాత్రమే సినిమా కి హైలైట్ గా కొత్తగా కనబడుతుంది. ఈ శాస్త్రి రోల్ ని కామెడీ, యాక్షన్, గ్లామర్‌ని టచ్ చేసి కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ హరీష్‌శంకర్. మనం ట్రైలర్ విషయంలో చెప్పుకున్నట్టే అల్లుఅర్జున్.. ఒకవైపు శాస్త్రిగాను, మరోవైపు డీజేగా క‌నిపించి దుమ్మురేపాడు. డీజేగా స్టైలిష్‌గా నటించడమనేది అల్లు అర్జున్ కి కొట్టిన‌పిండే. అల్లు అర్జున్ శాస్త్రిగా చేసిన సంద‌డే ఈ దువ్వాడ చిత్రంలో కొత్తద‌నాన్ని పంచుతుంది.ఇక డీజే చిత్రానికి మరో ప్లస్ పాయింట్ హీరోయిన్ పూజా‌హెగ్డే. పూజ హెగ్డే పాత్రకి పెద్దగా ప్రయార్టీ లేకపోయినా.... ఆమె తన అందంతో ఆక‌ట్టుకుంది. అలాగే పూజ బికినీతో కనబడే సీన్స్ మాత్రం హైలెట్ అనే చెప్పాలి. పాటల్లో అల్లు అర్జున్ తో సరిసమానంగా డాన్స్ ల్లో మెప్పించిన పూజ అందాల ఆరబోతలో కూడా ఏ మాత్రం వెనకడుగు వెయ్యలేదు. అలాగే అల్లు అర్జున్, పూజ హెగ్డే ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక విలన్ గా రొయ్యల నాయుడు పాత్రలో రావు రమేష్ అరిపించేసాడు. తన తండ్రి రావు గోపాల రావు ని మరోసారి గుర్తుకు తెచ్చాడు. తనికెళ్ల భరణి, మురళిశర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు: డైరెక్టర్ హరీష్ శంకర్ విషయానికి వస్తే దువ్వాడ జగన్నాథం చిత్రంలో చాలా స‌న్నివేశాలు ప్రేక్షకుడి అంచ‌నాకు త‌గ్గట్లే తియ్యగలిగాడు. స్టోరీలో ఎలాంటి ట్విస్ట్‌లు లేవు. క్లైమాక్స్ ఓ రేంజ్‌లో వుంటుందని భావించిన వాళ్లకి డీజే కామెడీతో సరిపెట్టేశాడు డైరెక్టర్. మొత్తానికి కామెడీతో కాలక్షేపం చేశాడే తప్ప, చెప్పుకోదగిన స్టోరీతో రక్తి కట్టించలేదన్నది సగటు ఆడియన్స్ మాట. ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీతోనే నడిపోతుంది.. ఇంటర్వెల్‌కి ముందు వ‌చ్చే సీన్స్ యాక్షన్ పార్ట్‌ని మ‌రింత‌ పెంచింది. అయితే ఫైనల్ గా హరీష్ శంకర్ రొటీన్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ లో కామెడీ తో ఆకట్టుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం బోర్ కొట్టించేసాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డీజే కి ప్రాణం పోసింది. పాటలుకు తగ్గ మ్యూజిక్ ని అందించాడు దేవిశ్రీ. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నది. ప్రతి పాటలో కెమెరా వర్క్ బాగుంది. బోస్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ లో కొని సీన్స్ కి కత్తెర వేస్తె సినిమా ఫలితం మరోలా ఉండేది. అలాగే దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటల లొకేషన్స్ విషయంలోను, ఖరీదైన లొకేషన్స్ లో షూటింగ్ చెయ్యడం వంటి విషయాలే కాకుండా ఖర్చు విషయంలో ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.

ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్ నటన, ఎనేర్జి లెవల్స్, పూజ హెగ్డే గ్లామర్, ఫస్ట్ హాఫ్, మ్యూజిక్, కొన్ని కామెడీ సీన్స్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: రొటీన్ కథ, సెకండ్ హాఫ్, ఎడిటింగ్, ట్విస్టులు లేకపోవడం, బన్నీ డాన్స్ కొత్తగా లేకపోవడం

రేటింగ్: 2 .75/5

Similar News