ద్వారక మూవీ రివ్యూ ( రేటింగ్‌: 2 .0 /5 )

Update: 2017-03-03 15:14 GMT

నటీనటులు: విజయ్ దేవరకొండ, పూజ జవేరి, ప్రకాష్ రాజ్, పృద్వి, ప్రభాకర్, సురేఖావాణి

మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తీక్

నిర్మాత: ప్రద్యుమ్న, చంద్రపాటి , గణేష్ పెనుబోతు

డైరెక్టర్: శ్రీనివాస రవీంద్ర

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' లో ఒక కేరెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ.... ,ఎవడే సుబ్రమణ్యం, లో రిషిగా అద్భుతమైన కేరెక్టర్ చేసాడు. ఆ చిత్రంలో చాలా నేచురల్ గా నటించి హీరో నానితో సమానంగా క్రెడిట్ కొట్టేసాడు. తర్వాత 'పెళ్లి చూపులు' చిత్రం తో హీరోగా టాలీవుడ్లోకి ఎంటర్ అయ్యాడు. ఇక 'పెళ్లి చూపులు' విజయ్ రేంజ్ ని ఒక్కసారిగా మార్చేసింది. హీరోగా, నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టి విజయ్ లైఫ్ ని ఒక్కసారిగా మార్చేసింది ఆ చిత్రం. చిన్న సినిమాగా విడుదలైన ఈ పెళ్లి చూపులు కోట్లు కొల్లగొద్దీ అదరహో అనిపించింది. ఆ దెబ్బకి విజయ్ దేవరకొండకి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ అవకాశాలలో భాగంగానే 'ద్వారకా' లో మంచి ఛాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో నకిలీ స్వామిగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని ట్రైలర్స్ లో చూపించేసారు. పెళ్లి చూపులు తర్వాత హీరోగా చేస్తున్న విజయ్, పూజా జవేరి తో జోడి కట్టిన ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. హీరోగా నిలదొక్కుకోవాలని ఆరాటపడుతున్న విజయ్ కి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: అతని పేరు ఎర్రశ్రీను(విజయ్‌ దేవరకొండ). ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటాడు. ఓ దొంగతనం చేసి పారిపోతుండగా వసుధ(పూజా ఝవేరి)ని తొలిసారి చూస్తాడు. తొలిచూపులోనే ఆమెని ప్రేమిస్తాడు. అక్కడి నుంచి తప్పించుకున్న శ్రీను ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి టెర్రస్‌ మీదకి చేరుకొని అక్కడే వున్న ఓ కాషాయ వస్త్రాన్ని ఒంటికి చుట్టుకొని పడుకుంటాడు. కాస్త వెనక్కి వెళ్తే.. నష్టాల్లో వున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక వ్యక్తి రాకతో పుంజుకుంటుందని, కోట్లకు పగలెత్తుతావని ఓ స్వామీజీ(పృథ్వీ) మాటల్ని సీరియస్‌గా తీసుకొని అతని కోసం చూస్తుంటాడు ఆ వ్యాపారి. టెర్రస్‌ మీద కాషాయ వస్త్రంతోనే పడుకున్న శ్రీను తెల్లవారే సరికి కృష్ణానంద స్వామిగా మారిపోతాడు. అక్కడే వున్న స్వామీజీ కూడా అతనే దేవుడని, కృష్ణానంద స్వామి అని ధృవీకరిస్తాడు. ఇక అంతే.. అప్పటి నుంచి ఆ అపార్ట్‌మెంట్‌ ఓ ఆశ్రమంగా మారిపోతుంది. రోజూ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో భక్తులు వచ్చి డబ్బు రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇవన్నీ నచ్చని శ్రీను అక్కడి నుంచి పారిపోదామనుకుంటాడు. ఆ టైమ్‌లో తను ప్రేమించిన వసుధను చూస్తాడు. ఆమె కోసం అక్కడే వుండిపోతాడు. కోట్లల్లో ఆదాయం వస్తున్న ఆశ్రమాన్ని ఒక లాయర్‌, ఒక పోలీస్‌, ఒక రాజకీయ నాయకుడు తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. తాము చెప్పినట్టే వినాలని శ్రీనుని ఆదేశిస్తారు. అతను దేవుడు కాదని, ఒక దొంగ అని తెలుసుకున్న వసుధ అతన్ని అసహ్యించుకుంటుంది. తను అతన్ని ప్రేమించాలంటే మనిషిగా మారమని చెప్తుంది. మరో పక్క ఎప్పుడూ దొంగ బాబాలను ఏరి పారేసే పనిలోనే వుండే చైతన్య(మురళీశర్మ) దృష్టి కృష్ణానంద స్వామిపై పడుతుంది. టైమ్‌ కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే కృష్ణానంద స్వామిగా ఛలామణి అవుతున్న శ్రీను వ్యక్తిగతంగా మంచివాడేనని, వసుధ కోసమే అక్కడ వున్నాడని తెలుసుకుంటాడు. శ్రీను దేవుడు ముసుగులో నుంచి బయటపడి సాధారణ జీవితం గడిపేందుకు చైతన్య ఒక ప్లాన్‌ వేస్తాడు. ఆ ప్లాన్‌ ఏమిటి? తన ప్రేమ కోసం వేల కోట్ల డబ్బుని శ్రీను వదులుకోవడానికి సిద్ధపడ్డాడా? ఆశ్రమాన్ని గుప్పిట్లో పెట్టుకున్న త్రిమూర్తుల నుండి శ్రీను ఎలా తప్పించుకున్నాడు? చివరికి శ్రీను, వసుధల పెళ్ళి జరిగిందా? అనేది తెరమీద చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: దొంగ బాబాగా విజయ్ దేవరకొండ అద్భుతమైన నటన కనబర్చాడు. దొంగ బాబా ఏమేం చేసి ఆకట్టుకునాటాడో అన్ని విద్యలు విజయ్ చేసి మెప్పించాడు. గారడీలు, అందరిని బురిడీ కొట్టించే పనులు విజయ్ చాలా చాకచక్యం గా చేసేసాడు. అలాగే పూజా జవేరి పాత్రకి పెద్ద స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి కీలక మలుపు మురళీ శర్మ ఎంటర్ అవ్వడంతో ఆసక్తిగా మారుతుంది.మిగిలిన పాత్రల్లో ప్రభాకర్‌ చేసిన లాయర్‌ పాత్ర, జాకీ చేసిన పోలీస్‌ క్యారెక్టర్‌, ప్రభు చేసిన పొలిటికల్‌ లీడర్‌ క్యారెక్టర్‌ ఏమాత్రం కొత్తదనం లేని విలన్‌ క్యారెక్టర్స్‌. ప్రీ క్లైమాక్స్‌లో కనిపించే ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. హేతువాది చైతన్యగా మురళీశర్మ క్యారెక్టర్‌ కాస్త కొత్తగా అనిపించినా పెర్‌ఫార్మెన్స్‌ పరంగా చూస్తే పైన చెప్పిన ఆర్టిస్టులకు ఈ క్యారెక్టర్లు పెద్దగా పేరు తెచ్చేవి కావు. సుదర్శన్‌, షకలక శంకర్‌, నవీన్‌లతో అక్కడక్కడ కామెడీ చేయించే ప్రయత్నం చేసినా అది అంతగా సక్సెస్‌ అవ్వలేదు.

ఇక దర్శకుడు శ్రీనివాస రవీంద్ర గురించి చెప్పాలంటే తానూ ఎం చెప్పాలనుకున్నాడో దానికి కామెడీని జోడించి కథలోగానీ, కథనంలోగానీ ఎలాంటి కొత్తదనం లేని ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా లేకపోవడం, బోరు కొట్టించే సన్నివేశాలు కోకొల్లలుగా వుండడం సినిమాకి పెద్ద మైనస్‌ పాయింట్స్‌. పృథ్వి కామెడీ, హీరో హీరోయిన్స్ మధ్యన లవ్ ట్రాక్ విషయంలో దర్శకుడు మరికాస్త శ్రద్ద పెట్టు ఉంటే బావుండేది. శ్యామ్‌ కె.నాయుడు ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సీన్స్‌ అన్నీ రిచ్‌గానే కనిపిస్తాయి. ముఖ్యంగా పాటల్లో ఆ రిచ్‌నెస్‌ అనేది బాగా తెలుస్తుంది. సాయికార్తీక్‌ చేసిన పాటల్లో రెండు డూయట్స్‌ మాత్రమే వినదగ్గవిగా వున్నాయి. వాటి పిక్చరైజేషన్‌ కూడా బాగుంది. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో సాయికార్తీక్‌ ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. కాస్తో కూస్తో కొన్ని సీన్స్‌ ఎలివేట్‌ అయ్యాయంటే అది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్లే. లక్ష్మీభూపాల్‌ రాసిన మాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కథ, కథనాలు ఎలా వున్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కే ప్రాధాన్యం పెరిగిన ఈ టైమ్‌లో ద్వారక లాంటి సినిమా చూడాలంటే సాహసం చెయ్యాల్సిందే.

ప్లస్ పాయింట్స్: విజయ్ నటన, పాటలు, కథనం, కామెడీ

మైనస్ పాయింట్స్: కథ, కథనం, దర్శకత్వం, మ్యూజిక్

రేటింగ్‌: 2 .0 /5

Similar News