నటీనటులు : నాని, నివేత థామస్, ఆది పినిశెట్టి, మురళి శర్మ, పృథ్వి, తనికెళ్ళ భరణి
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : డి.వి.వి దానయ్య
దర్శకత్వం : శివ నిర్వాణ
వరుస హిట్లతో యమా జోరు మీదున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు పూర్తిగా ప్రేమకథలనే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాడు. క్లాస్ సినిమాలు చేస్తూ మాస్ కి దూరమవుతున్నాడు. అయినా కూడా హిట్స్ అందుకుంటూనే వున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీ లు చేస్తున్న నాని ఇప్పుడు కూడా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో శివ నిర్వాణ డైరెక్షన్ లో నిన్ను కోరి అంటూ వచ్చేసాడు. జంటిల్మన్ వంటి సస్పెన్సు త్రిల్లర్ చిత్రంలో రెండు వేరియేషన్స్ వున్న పాత్రల్లో నటించిన నానికి, ఆ చిత్రంలో జోడిగా నటించిన నివేత థామస్ ఇప్పుడు నిన్ను కోరిలో కూడా నాని తో జోడి కట్టింది. హైట్ తో సంబంధం లేకుండా నటనకు నూటికి నూరు మార్కులు వేయించుకుంటూ అందరిని ఆకట్టుకుంటున్న నివేత థామస్ మరోసారి నానితో కలిసి నటింస్తుంది. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి కూడా ఒక కీలక పాత్ర చేసాడు. మరి నాని, నివేత, ఆది ల మధ్య జరిగే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని కొత్త దర్శకుడు శివ నిర్వాణ కొత్తగా స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేసాడో అనే విషయం మనకు నిన్నుకోరి థియేట్రికల్ ట్రైలర్ లోనే చాలా వరకు అర్ధమైంది. అలాగే నాని నిన్నుకోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిన్నుకోరి సినిమా మీద పూర్తి కాన్ఫిడెంట్ తో కనబడమే కాకుండా... ఈ చిత్రం ఖచ్చితం గా హిట్ అవుతుందని.... ప్రేక్షకులు హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ఫై అవుతారని చెప్పాడు. ఇక సినిమా గనక నచ్చకపోతే తనని డైరెక్ట్ గా ప్రశ్నించమని కూడా చెప్పాడు. మరి నాని ఇంత కాన్ఫిడెంట్ గా వున్నాడు అంటే సినిమాలో ఎదో బలమైన విషయముందనేగా దానర్ధం. నాని అలా అంత కాన్ఫిడెంట్ గా చెప్పడం చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిని అంటాయి. అలాగే నిన్నుకోరి ప్రమోషన్స్ లో కూడా నాని ఈ సినిమా డెఫనెట్ గా హిట్ కొడుతుందని బల్లగుద్ది మరీ చెప్పాడు. మరి నానికి ఈ సినిమాపై ఉన్న నమ్మకం నిజమో కాదో తెలుసుకోవాలంటే మనం సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ: 'నిన్ను కోరి' చిత్రం స్టార్టింగ్ లో మనకు శ్రీకాంత్, ఉపేంద్ర నటించిన 'కన్యాదానం', అలాగే శ్రీకాంత్, రాశిల 'ప్రేయసి రావే' చిత్రాలకు దగ్గరాగా వున్నట్లుండి అనిపిస్తుంది. ఇక 'నిన్ను కోరి' కథలోకి ఎంటర్ అయితే వైజాగ్ లో చదుచుతున్న ఉమా(నాని) అనే కుర్రాడు పిహెచ్ డి చేస్తుంటాడు. చదువుకునేటప్పుడే ఉమా.. పల్లవి( నివేత థామస్)ప్రేమలో పడతాడు. ఇక పల్లవి కూడా ఉమని గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ పల్లవి తండ్రికి పల్లవి ప్రేమించే విషయం తెలియక ఆమెకి పెళ్లి చేసే ఉద్దేశ్యంతో సంబంధాలు చూస్తుంటాడు. విషయం తెలుసుకున్న పల్లవి, ఉమా దగ్గరికి వచ్చి ఇద్దరం పెళ్లి చేసుకుని ఎక్కడైకైనా దూరంగా వెళ్ళిపోదామని చెబుతుంది. కానీ ఉమా తనకి జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెబుతాడు. అందులో భాగంగానే ఉమా కెరీర్ కోసం వైజాగ్ వదిలి వెళ్ళిపోతాడు. ఉమా వైజాగ్ వదిలి వెళ్ళగానే పల్లవికి అరుణ్ (ఆది పినిశెట్టి)ని ఇచ్చి పెళ్లి జరిపించేస్తాడు పల్లవి తండ్రి. పల్లవి తన ప్రేమను బయట పెట్టకుండా సైలెంట్ గా అరుణ్ ని పెళ్లి చేసుకుంటుంది. మరి అరుణ్ తో పల్లవి మంచి భార్యగా నడుచుకుంటుందా..? కెరీర్ కోసం ఊరిని, పల్లవిని వదిలి వెళ్లిన ఉమా మళ్ళీ తిరిగి వస్తాడా? ఉమా తిరిగొచ్చాక పల్లవిని కలుసుకుంటాడా.? అసలు అరుణ్ కి పల్లవి ప్రేమించిన విషయం తెలుస్తుందా..? అసలు ఉమా, పల్లవిలు చివరికి కలుస్తారా? అన్నది తెలియాలంటే ఖచ్చితంగా నిన్నుకోరి చిత్రాన్ని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: నాని మరోసారి రెచ్చిపోయి నటనతో ఆకట్టుకున్నాడు. పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేస్తూ బాగా ఆకట్టుకున్నాడు. నివేద థామస్ తననుండి దూరమైనప్పుడు ఫేస్ లోని ఎక్సప్రెషన్స్ తో నాని జీవించాడంటే నమ్మాలి. ప్రియురాలి కోసం ఎదురు చూసే ప్రియుడిగా నాని 100 పెర్సెంట్ నటనతో రక్తికట్టించారు. అలాగే ఆది పినిశెట్టి కూడా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. నివేత భర్త పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు ఆది. ఇక హీరోయిన్ నివేత థామస్ నటన ఎలా ఉంటుందో మనం జంటిల్మన్ లోనే చూసేసాం. ఆ అమ్మాయి గ్లామర్ గా లేకపోయినా కూడా నటనలో ఆరితేరిపోయి నటిస్తుంది. నిన్నుకోరిలో కూడా ప్రేమికురాలిగా, భార్యగా నివేద ఎంతో చక్కటి నటనని ప్రదర్శించింది. ఇక మురళి శర్మ నివేద తండ్రిగా కాస్త కామెడీ పండించాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు శివ డైరెక్షన్ కి కొత్త. కానీ ఆ కొత్త అనే పదం ఎక్కడా కనబనీయకుండా కథను స్క్రీన్ మీద ప్రెసెంట్ చెయ్యడంలో శివ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. క్లారిటీగా... కొత్తగా ప్రెసెంట్ చేసాడు. శివకి చక్కని నటీనటులు దొరికారు. వారు డైరెక్టర్ సినిమాలో ఎలా చెయ్యాలనుకున్నాడో అలా నటించి మెప్పించారు. నాని, నివేద, ఆదిలు చాలా సహజసిద్ధంగా నటించి మెప్పించారు. రొమాంటిక్, ఎమోషనల్ లవ్ స్టోరీగా నిన్నుకోరి కథను మలిచాడు దర్శకుడు. కాకపోతే సినిమాలో ఎమోషన్ కి ఇంకాస్త చోటివ్వాల్సింది. అలాగే కాస్త రొటీన్ సినిమా గా నిన్నుకోరి ని ప్రేక్షకుడు అనుకున్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టక పోవడంతో సినిమాపై మంచి ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఇక డైరెక్టర్ శివ కథలో బలమైన సన్నివేశాలకు ఎక్కడాచోటివ్వలేదు. అందులోను సినిమా అంత ఆలా అలా సాగిపోతోనే ఉంటుంది. అయితే దర్శకుడు మల్టిప్లెక్స్ ఆడియోన్స్ ని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నాడా... అనిపిస్తుంది. ఈ చిత్రం కెలవం క్లాస్ ఆడియన్సు ని మాత్రమే మెప్పించగలదు. బి, సి సెంటర్స్ ఆడియోన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే గోపి సుందర్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. పాటలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. ఇక నిన్నుకోరి చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో బాగా చూపించాడు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక డివివి దానయ్య నిర్మాణ విలువలు సినిమాకి ప్లస్ అనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్: నాని, నివేద థామస్, ఆది, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైరెక్షన్, రొమాంటిక్ సీన్స్, సెకండ్ హాఫ్ , సింపుల్ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ, స్టోరీ నిదానంగా నడవడం, అబ్బో అనిపించే సీన్స్ లేకపోవడం, మాస్ ఎలెమెంట్స్ లేకపోవడం
పంచ్ లైన్: ఓవరాల్ గా పక్క క్లాస్ మూవీ
రేటింగ్: 2.75 /5