నేను లోకల్ మూవీ రివ్యూ ( రేటింగ్: 3 .0 /5 )

Update: 2017-02-03 09:47 GMT

నటీనటులు: నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్

మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్

నిర్మాత: దిల్ రాజు

దర్శకత్వం: త్రినాథరావు

'ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివోయ్, కృషగాడి వీర ప్రేమ గాధ, జెంటిల్మన్ , మజ్ను' చిత్రాలతో వరస విజయాలందుకున్న నేచురల్ స్టార్ నాని 'నేను లోకల్' అంటూ డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి థియేటర్స్ లోకి వచ్చేసాడు. ఇక ఈ చిత్రానికి తాజాగా 'శతమానంభవతి' చిత్రంతో సూపర్ సక్సెస్ సాధించిన సక్సెస్ ఫుల్ పొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా చెయ్యడం.... 'ఖైదీ నెంబర్ 150 ' వంటి మాస్ చిత్రానికి అల్లాడించె మాస్ ట్యూన్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ 'నేను లోకల్' చిత్రానికి నాని ని దృష్టిలో పెట్టుకుని యూత్ కి సరిపోయే మ్యూజిక్ తో క్లాస్ పాటలుకు కూడా తనదైన స్టయిల్లో అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడం.... 'సినిమా చూపిస్త మావ' చిత్రంతో హిట్ కొట్టిన త్రినాథరావు ఈసారి నానిని పక్కా లోకల్ గా 'నేను లోకల్' లో చూపించి సక్సెస్ సాధించాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ లక్కీ హీరోయిన్ గా ఒక్క తెలుగు సినిమా కే మంచి పేరు తెచ్చుకుంది. 'నేను శైలజ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి రెండో డైరెక్ట్ తెలుగు చిత్రం 'నేను లోకల్'. తమిళంలో వరస హిట్స్ దూసుకుపోతున్న కీర్తి అదే హవాని తెలుగులో కూడా కొనసాగించించడానికి 'నేను లోకల్' తో రాబోతుంది. అలాగే మొదటి సారి హీరో నవీన్ చంద్ర విలన్ గా 'నేను లోకల్' లో చెయ్యబోతున్నాడు. ఇక ఇప్పటికే ట్రైలర్స్ తో సాంగ్స్ తో 'నేను లోకల్' అంటూ హడావిడి చేస్తున్న నాని ... డబుల్ హ్యాట్రిక్స్ కోసం టాప్ టెక్నీషియన్స్ తో చేసున్న ఈ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ: బాబు (నాని) అల్లరిచిల్లరిగా తిరుగుతూ పనీపాట లేకుండా తిరిగే ఒక ఆకతాయి కుర్రోడు. అసలు తన లక్ష్యం ఏమిటో కూడా తెలియకుండా కాలం గడిపేస్తూ ఎట్టకేలకు బిటెక్ పాసవుతాడు. అలా అల్లరిచిల్లరిగా తిరుగుతూ వున్నప్పుడే కీర్తి (కీర్తి సురేష్) ని చూసి లవ్ లో పడతాడు. అయితే కీర్తి కూడా కొన్ని విషయాలలో బాబు లోని అల్లరితనం, మంచితనం నచ్చి లవ్ చేస్తుంది. అయితే వీరి ప్రేమకు కీర్తి తండ్రి ఒప్పుకోడు.అయన ఒక లెక్చరర్. ఆయనకి బాబులాంటి ఆకతాయి కుర్రాడు నచ్చడు. అందుకే డీసెంట్ కుర్రాడైన సిద్దర్థ్ ( నవీన్ చంద్ర) తో కీరేహి పెళ్లి ఖాయం చేస్తాడు. ఇక బాబు కూడా వేరే సమస్యల్లో ఇరుక్కుని తన ప్రేమను సాధించుకోవడంకోసం నానా తంటాలు పడుతుంటాడు. అసలు కీర్తి- బాబు ల ప్రేమను కీర్తి తండ్రి ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటి? బాబు అంతలా ప్రేమించిన కీర్తి కోసం ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంటాడు? అసలు కీర్తి, సిద్దర్థ్ ని పెళ్లి చేసుకుంటుందా? అనేవి తెర మీద చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: నాని ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించేసాడు. బాబు పాత్రకి నాని తప్ప మరెవ్వరూ చెయ్యలేరు అనే రీతిలో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం నాని వన్ మ్యాన్ షో నడిచింది అంటే నమ్మాల్సిందే.నాని పెరఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. నాని అటు క్లాస్ ఆడియన్స్, ఇటు మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టున్నాడు. హీరోయిన్ గా కీర్తి అందంతో అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది. గ్లామర్ పరంగా ఆమె కొన్ని కండిషన్స్ పెట్టినా కూడా అందమైన అభినయంతో గ్లామర్తో పనిలేదుఅనిపించేలా నటించింది. నాని - కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ బాగా పండింది. నవీన్ చంద్ర ఒక కీలక మైన పాత్రకి నెగెటివ్ షేడ్స్ లో బాగా నటించాడు. ఇక పోసాని కృష్ణ మురళి తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. కృష్ణ భగవాన్, ఈశ్వరి రావు వారి పరిధిమేర బాగా నటించారు.

సాంకేతికవర్గం: డైరెక్టర్ త్రినాథరావు అసలు కథను నాని కోసమే రాసుకుని... నానిని దృష్టిలో ఉంచుకునే కథను అల్లినట్లు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఒక చక్కటి ప్రేమ కథతో ఫ్రెష్ ఫీల్ కలిగించేలా ఫస్ట్ హాఫ్ ని మలచగలిగాడు. కామెడీ టైమింగ్ తో సినిమా ఫస్ట్ హాఫ్ ని ఒక రేంజ్ లో తెరకెక్కించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ తో కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తున్నాడు అనుకునేసరికి.... ఎమోషన్, కామెడీతో నెట్టుకొచ్చేసాడు. ఇక సినిమా అంతా ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్ తో అదరగొట్టేసాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ 'నేను లోకల్' పాటలను ఒక రేంజ్ లో చితకొట్టేశారు. సినిమా విడుదలకు ముందే పాటలకు రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. మ్యూజిక్ పరంగా దేవిశ్రీకి 100 శాతం మార్కులు వేసేయ్యొచ్చు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకు హైలైట్. దిల్ రాజు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా నిర్మించాడు.

మళ్ళీ నాని 'నేను లోకల్' తో సూపర్ హిట్ విజయాన్ని అందుకుని తనకి తిరుగులేదనిపించేసాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన నాని.. నేచురల్ స్టార్ అనే పదానికి కరెక్ట్ గా సూట్ అయ్యాడని ప్రతి ఒక్క సినిమాకి అర్ధమవుతూనే వుంది. సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ చిన్న డైరెక్టర్స్ తో కూడా సూపర్ సక్సెస్ ని సాధించ వచ్చని నాని మరోమారు రుజువు చేసాడు.

ప్లస్ పాయింట్స్: నాని, కీర్తి సురేష్, కథనం, పాటలు, ఇంటర్వెల్ బ్యాంగ్, కామెడీ

మైనస్ పాయింట్స్: కథ, సెకండ్ హాఫ్, ప్రీ క్లైమాక్స్

రేటింగ్: 3 .0 /5

Similar News