నేనో రకం మూవీ రివ్యూ

Update: 2017-03-16 18:48 GMT

నటీనటులు : సాయి రామ్ శంకర్, శరత్ కుమార్, రేష్మి మీనన్

సంగీతం : మహిత్ నారాయణ్

నిర్మాత : దీప శ్రీకాంత్

దర్శకత్వం : సుదర్శన్ సాలేంద్ర

పూరి జగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి రామ్ శంకర్ హీరోగా ఎదగడానికి ఇప్పటికీ కష్టపడుతూనే వున్నాడు. అతని కెరీర్ లో ఒకే ఒక్క '1 4 3 ' చిత్రమే చెప్పుకోదగిన చిత్రం. ఆ చిత్రం తర్వాత మళ్ళీ సాయి రామ్ శంకర్ కి ఒక్క హిట్ సినిమానే కాదు... చెప్పుకోదగిన చిత్రం లేకుండా పోయింది. అన్న పూరి అండతో పైకి వద్దామనుకుని ట్రై చేసి ట్రై చేసి అప్పటికి ఇప్పటికి అలానే కష్టపడుతున్నాడు. ఒకొనొక సమయంలో హీరోగా బాగా గ్యాప్ వచ్చేసింది సాయి కి. అయినా కూడా మళ్ళీ చిన్న చిన్న చిత్రాలతో ప్రేక్షకులని పలకరిస్తూనే వున్నాడు. ఇప్పుడు తాజాగా సాయి రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'నేనో రకం'. అయితే ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రీతిలో భారీ ప్రమోషన్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు భారీ ప్రమోషన్ నడుమ విడుదలవుతున్న 'నేనో రకం' చిత్రంతో ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో సాయి తన పేరుని కూడా మార్చుకున్నాడు. ‘రామ్ శంక‌ర్‌’గా పేరు మార్చుకుని తన లక్కుని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతూ... భారీ పబ్లిసిటీ నడుమ ప్రేక్షకులని పలకరించడానికి వస్తున్న ‘రామ్ శంక‌ర్‌’ ని లక్కు ఏ మాత్రం వరించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: గౌతమ్ (రామ్ శంకర్) ఒక అనాథ. ఎప్పుడూ గాలికి తిరుగుతూ పనిపాట లేకుండా ఉండే గౌతమ్ పండగ ఫైనాస్స్ లో మనీ రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. అలా పనిచేసే గౌతమ్ ఒకొనొక సమయంలో స్వేచ్ఛ ప్రేమలో పడతాడు. స్వేచ్ఛ (రేష్మి మీనన్) ని చూడగానే ప్రేమలో పడిన గౌతమ్ ఆమె కోసం ఏదైనా చేసే స్టేజ్ కి వెళతాడు. ఆమె ప్రేమ కోసం అబద్దాలాడడం, ఇతరులని మోసం చెయ్యడం చేస్తూ చివరికి స్వేచ్ఛ ప్రేమను గెలుచుకుంటాడు. స్వేచ్ఛ కూడా గౌతమ్ ని ప్రేమిస్తుంటుంది. ఆ విషయం గౌతమ్ కి చెప్పడానికి గౌతమ్ దగ్గరికి బయలుదేరుతుంది. మధ్యదారిలో స్వేచ్చని కిడ్నాప‌ర్(శ‌ర‌త్‌కుమార్‌) కిడ్నాప్ చేపిస్తాడు. స్వేచ్చని కిడ్నాప్ చేసిన శరత్ కుమార్ గౌతమ్ కి ఫోన్ చేసి ఆమెను వదిలిపెట్టాలంటే తనుచెప్పిన పనులన్నీ గౌతమ్ చెయ్యాల్సిందే అని కండీషన్ పెడతాడు. అసలు స్వేచ్చని శరత్ కుమార్ కిడ్నాప్ ఎందుకు చేస్తాడు? గౌతమ్ కి మాత్రమే ఎందుకు ఫోన్ చేస్తాడు? అసలు గౌతమ్ తో కిడ్నాపర్ చేయించుకునే పనులేమిటి? అసలీ కిడ్నాపర్ చెర నుండి స్వేచ్చని గౌతమ్ రక్షిస్తాడా? అనేవి తెలియాలంటే 'నేనో రకం' చిత్రాన్ని తేరా మీద వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు: రామ్ శంకర్ ఎప్పటిలాగే తన ఎనేర్జి తో మంచి నటన కనబర్చాడు. గౌతమ్ కేరెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు. లవర్ బాయ్ గా ప్రేమికురాలిని రక్షించుకునే రక్షకుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. రేష్మి మీనన్ కూడా స్వేచ్ఛ కేరెక్టర్ లో ఆకట్టుకుంది. ఇక నెగెటివ్ శేట్స్ ఉన్న పాత్రలో శరత్ కుమార్ నటనలో విశ్వరూపం చూపించాడు. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు శరత్ కుమార్. ఇక ఎంఎస్ నారాయణ తన చివరి దశలో నటించిన చిత్రమిది. వైవా హర్ష కామెడీ పాత్ర పెద్దగా పండలేదనే చెప్పాలి. ఇక నెగెటివ్ షేడ్స్ వున్న కేరెక్టర్ లో ఆదిత్య చక్కగా నటించి మార్కులు కొట్టేసాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు సుదర్శన్ ఈ చిత్రాన్ని ఎలా ప్రెసెంట్ చెయ్యాలనుకున్నాడో అలాగే చూపించాడు. మంచి లైన్ తీసుకుని....చ‌క్క‌టి క‌థ‌నంతో ముందుకు న‌డిపించాడు.ఒక మెస్సేజ్ ఓరియెంటెడ్ చిత్రం గా మలిచిన దర్శకుడు కామెడీని నెగ్లెట్ చెయ్యడం ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ గా చెప్పుకోవచ్చు. కిడ్నాప్ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా మలిచాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే పరంగాను డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కాకపోతే శరత్ కుమార్ వంటి బడా స్టార్ ని విలన్ గా ఎంచుకున్నప్పుడు డైరెక్టర్అతన్ని మరింత పవర్ ఫుల్ గా చూపిస్తే ఇంకా బావుండేది. సిద్ధార్థ్ రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ పర్వాలేదనిపించింది. మ‌హిత్ నారాయ‌ణ చెప్పుకోదగిన మ్యూజిక్ అందించలేకపోయాడనే చెప్పాలి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే వుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏది ఎలాగున్నా కామెడీకి కూడా కొంతమేర అవకాశం ఇచ్చినట్లయితే ఈ సినిమా రిసల్ట్ మరోలా ఉండేది.

ప్లస్ పాయింట్స్: సాయిరాం శంకర్ నటన, శరత్ కుమార్, సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్: కామెడీ, ఫస్ట్ హాఫ్, పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, కథనం

Similar News