యాంగ్రీ యంగ్‌మేన్ డాక్టర్ రాజశేఖర్ చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా పి ఎస్ వి గరుడవేగ. రాజశేఖర్ కెరీర్‌లోనే రూ.30 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ప్రీమియర్ షోల టాక్ ప్రకారం ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది ? సినిమా రిజల్ట్ ఎలా ఉందో ? చూద్దాం.
సినిమా ఫస్టాఫ్‌లో హీరో రాజశేఖర్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ సినిమా ఉంటుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారిగా పనిచేసే రాజశేఖర్ తన ఇన్వెస్ట్‌గేషన్ క్రమంలో డ్రగ్ మాఫియా, అక్రమ మైనింగ్‌తో పాటు సమాజంలో జరిగే పలు చీకటి కోణాల గురించి తెలుసుకుంటాడు. వీటి గుట్టు రట్టు చేసేందుకు ఓ సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఫస్టాఫ్ అంతా ఆసక్తికరమైన సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్‌గా, ఉత్కంఠగాను ఉంటుంది. ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఫస్టాఫ్ కథనాన్ని కూడా చాలా స్పీడ్‌గా నడిపించాడు.
ఇక కీలకమైన సెకండాఫ్‌లో కథ పలు మలుపులు తిరుగుతుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదించినట్టు ఉంటుంది. సెకండాఫ్‌లో అక్కడక్కడా కొన్ని సాగదీత సీన్లు ఉన్నాయి. గ్రాండ్ విజువల్స్, యాక్షన్ సీన్లు, ఉత్కంఠ కలిగించే సీన్లు హైలెట్‌గా నిలిచాయి. చాలా రోజుల తర్వాత మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్ ఈ సినిమాతో కమర్షియల్‌గా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో ? చూడాలి. ఏ సెంటర్లను బాగా ఆకట్టుకునే ఈ సినిమా బీ, సీ సెంటర్లలో ఎలా ఆడుతుందన్నదానిపైనే కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంది.
ప్లస్ పాయింట్స్ (+) :
- సూపర్బ్ ఫస్టాఫ్
- గ్రాండ్ విజువల్స్
- నిర్మాణ విలువలు
- రాజశేఖర్ యాక్టింగ్
- సన్నీలియోన్ ఐటెం సాంగ్
- క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ (-):
- సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు
- ఏ సెంటర్లు, మల్టీఫ్లెక్స్ స్టైల్ సినిమా
ఫైనల్‌గా...
ప్రీమియర్ షో టాక్ ప్రకారం మంచి మూవీగా టాక్ తెచ్చుకున్న ఈ గరుడవేగ పూర్తి రివ్యూతో మరి కొద్ది సేపట్లోనే కలుద్దాం.