నటీనటులు: చేతన ఉత్తేజ్, సంజీవ్, నందు, కారుణ్య
మ్యూజిక్ డైరెక్టర్: రామ్ నారాయణ్
నిర్మాత: కమల్ కుమార్ పందెం
డైరెక్టర్: శశి భూషణ్
టాలీవుడ్ ఆర్టిస్ కమ్ రైటర్ అయిన ఉత్తేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న నటుడు. ఖడ్గం సినిమాతో ఉత్తేజ్ కి మంచి పేరుతొ పాటే మంచి రోల్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు 'పిచ్చి గా నచ్చావ్' తో ఉత్తేజ్ కూతురు చేతన ఉత్తేజ్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ని డిఫ్రెంట్ గా చేసి ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడేలా చేసింది చిత్ర యూనిట్. అందులోని పేరున్న నటుడు ఉత్తేజ్ కూతురు చేతన నటించడం కూడా ఈ సినిమాపై ఆసక్తి కలిగించేలా చేశాయి. మరి టాలీవుడ్ నటుల్లో ఇలా తమ కూతుళ్ళని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటులు పెద్దగా లేరు. అయినా ఉత్తేజ్ ఎంతో ధైర్యం చేసి తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. మరి చేతన హీరోయిన్ గా నటించిన ఈ పిచ్చగా నచ్చావ్ చిత్రం ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో... హీరోయిన్ గా ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఈ చిత్రం ఎమన్నా హెల్ప్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ: అనన్య (చేతన ఉత్తేజ్) చందు అనే కుర్రాడిని ప్రేమిస్తున్నాను అంటూ అతని వెంట పడుతుంది. చందు ఒక అనాథ. అతనికి నా అన్నవాళ్ళు ఎవరూ లేక జీవనోపాధికోసం కార్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అలాంటి చందు వెంట అనన్య ప్రేమ గీమా అంటూ ఏడిపిస్తూ అతన్ని ప్రేమలో పడెయ్యడానికి తెగ ట్రై చేస్తుంటుంది. అసలు అతని పరిస్థితులు అతనికి ప్రేమను ఒప్పుకునేలా ఉండవు కాబట్టి ఆ ప్రేమను ఒప్పుకోవడానికి సిద్దమవలేకపోతాడు. మరి అనన్య చందుని ఎలా కన్విన్స్ చేస్తుంది? అసలు చందు, అనన్య ప్రేమని ఒప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడతాడు? అసలు చివరికి అనన్య, చందులు ఒక్కటవుతారా? అవన్నీ తెలియాలంటే ఖచ్చితం గా వెండి తెరమీద పిచ్చి గా నచ్చావ్ చిత్రాన్ని వీక్షించాలసిందే.
నటీనటుల పాత్ర: చేతన ఉత్తేజ్ నటన చూస్తుంటే ఎంతో ఎక్సపీరియెన్స్ ఉన్న హీరోయిన్ లా నటించింది. ఆమె అనన్య పాత్రకి న్యాయం చేసిందనే చెప్పాలి. ఆమె నటన పిచ్చి గా నచ్చావ్ కి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. చందు ఉన్నంతలో బాగానే నటించాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేర పర్వాలేదనిపించారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఒక మంచి సందేశంతో... యూత్ ని ఆకట్టుకునేలా మంచి స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చెయ్యడం మాత్రం పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. అసలు ఇప్పుడు ప్రతి ఒక్కరు కమర్షియల్ ఎలిమెంట్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. అలాంటి సమయంలో ఇలా కామెడీని నెగ్లెట్ చేస్తూ ఒక సినిమాని తెరకెక్కిస్తే దాని ఫలితం పెద్దగా ఉండదనేది మాత్రం అక్షర సత్యం. ఇంకా సినిమాల్లో మాస్ ఇల్లిన్స్ కి కూడా పెద్ద పీట వేసే ఈ కాలం లో ఇలా ప్రేమ కథ అంటూ కామెడీకి ఛాన్స్ ఇవ్వకుండా హిట్ కొట్టాలనే తపన పడడం కూడా వెర్రితనమే అవుతుంది. కథ, కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. ఇక సంగీతం విషయానికి వస్తే రామ్ నారాయణ్ సంగీతం పర్వాలేదనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఓకే గా వుంది. సినిమాటోగ్రఫీ బావుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బావుండేది.
ప్లస్ పాయింట్స్: చేతన నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: కథ, కథనం, కామెడీ, పూర్ స్క్రీన్ ప్లే