'ప‌ద్మావ‌త్' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2018-01-24 03:07 GMT

రిలీజ్‌కు ముందే ఇంకా చెప్పాలంటే షూటింగ్ ద‌శ‌నుంచే ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్‌గా మారిన ప‌ద్మావ‌త్ సినిమా ఎట్ట‌కేల‌కు రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 26న రిలీజ్ అవుతోంది. సెన్సార్ బోర్డు స‌భ్య‌లకే సెన్సార్ చేసేందుకే స‌వాల్‌గా మారిన ఈ సినిమాకు ప్రీమియ‌ర్ షోలు ఇప్ప‌టికే ప‌లు చోట్ల ప్ర‌ద‌ర్శించారు. దీపికా ప‌దుకొనే - షాహిద్ క‌పూర్ - ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం సినిమా ఎలా ఉందో ? చూద్దాం.

మహారాణి పద్మావతి మరియు సుల్తాన్ అల్లా వుద్దీన్ ఖిల్జీల కథ ఇది. ఓ హిస్టారిక‌ల్ సినిమాలో ద‌ర్శ‌కుడు బ‌న్సాలీ ఎమోష‌న‌ల్ సీన్ల‌ను హైలెట్ చేసిన తీరుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. బ‌న్సాలీ సినిమాల్లో విజువ‌ల్స్ అద్భుతంగా ఉంటాయి. ప‌ద్మావ‌త్‌లోనూ అదే రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన దీపికా పదుకొనె - షాహిద్ కపూర్ - రణవీర్ సింగ్ నటన ఆకట్టుకునే విధంగా ఉంది.

ఇక అల్లా వుద్దీన్ ఖిల్జీ రోల్‌లో ర‌ణ‌వీర్‌సింగ్ జీవించాడు. అత‌డి న‌ట‌నే సినిమాకు మేజ‌ర్ హైలెట్‌. ఇక ఈ సినిమాకు వేసిన సెట్లు నాటి కాలం వాతావార‌ణాన్ని చ‌క్క‌గా ప్ర‌తిబింబించాయి. ఇక ఈ సినిమా చ‌రిత్ర అంతా పూర్తిగా నార్త్ ఇండియాలో జ‌ర‌గ‌డంతో ద‌ర్శ‌కుడు ఎక్కువుగా ఉత్త‌రాది ప్ర‌జ‌ల ఎమోష‌న్స్ ఎలా ఉంటాయో ? అదే రేంజ్‌లో తెర‌కెక్కించాడు. ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఎంత వ‌ర‌కు న‌చ్చుతుందో ? చెప్ప‌లేం.

ఇలాంటి హిస్టారిక‌ల్ సినిమాల‌కు యుద్ధ స‌న్నివేశాలే హైలెట్‌. ప్రేక్ష‌కులు ఎక్కువుగా యుద్ధ స‌న్నివేశాల‌ను ఆస్వాదించేందుకే ఇలాంటి సినిమాలు చూడాల‌నుకుంటారు. మ‌నం బాహుబ‌లి సినిమాతో చూసిన యుద్ధాల‌తో పోలిస్తే ఈ సినిమాలో యుద్ధ స‌న్నివేశాలు చాలా వీక్‌. ద‌ర్శ‌కుడు యుద్ధ స‌న్నివేశాల క‌న్నా న‌టీన‌టుల నుంచి న‌ట‌న‌తో పాటు ఎమోష‌న్స్‌ను బాగా హైలెట్ చేశాడు. ఫైన‌ల్‌గా చెప్పాలంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు యావ‌రేజ్‌గా న‌చ్చే ఈ సినిమా నార్త్‌లో మాత్రం బాగా ఆడ‌వ‌చ్చు.

ప్ల‌స్ పాయింట్స్ (+):

- సంజ‌య్ లీలా బ‌న్సాలీ విజ‌న్‌

- దీపికా - షాహిద్ క‌పూర్ ల‌వ్ డ్రామా

- ఆర్ట్ వ‌ర్క్‌, సెట్టింగులు

- ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే షాకింగ్ ట్విస్ట్‌

- రాణీ ప‌ద్మావ‌త్ క్యారెక్ట‌ర్‌

- ఎమోష‌న‌ల్ క్లైమాక్స్‌

మైన‌స్‌పాయింట్స్ (-):

- కీల‌క స‌న్నివేశాలు తేలిపోవ‌డం

- యుద్ధ స‌న్నివేశాలు అంత గొప్ప‌గా లేక‌పోవ‌డం

- మాస్ ఆడియెన్స్ మ‌రీ గొప్ప‌గా మెచ్చే చిత్రం కాదు

Similar News