నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, మిస్తి చక్రబర్తి, తేజశ్వి మదివాడ
సంగీతం : సునీల్ కశ్యప్
నిర్మాత : అభిషేక్
దర్శకత్వం : నవీన్ మేడారం
'అష్టాచమ్మ' తో డీసెంట్ నటుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ అవసరాల 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో డైరెక్టరుగా కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ చిత్రంలో నటుడిగా కూడా మెప్పించిన అవసరాల మరికొన్ని చిత్రాల్లో నటుడిగా నటిస్తూనే నాగ శౌర్య, నారా రోహిత్, రెజినా తో 'జ్యో అచ్యుతానంద' చిత్రాన్ని డైరెక్ట్ చేసి డీసెంట్ హిట్ కొట్టాడు. మరి ఇంత టాలెంట్ ఉన్న నటుడు కమ్ డైరెక్టర్ అయిన శ్రీనివాస్ అవసరాల 'బాబు బాగా బిజీ' అనే అడల్ట్ కామెడీ చిత్రాన్ని ఒప్పుకోవడం ఒక సాహసమే. 'బాబు బాగా బిజీ' చిత్రం బాలీవుడ్ సినిమా ‘హంటర్' కి రీమేక్. 'హంటర్' చిత్రం బాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన చిత్రం. నూతన దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన ఈ 'బాబు బాగా బిజీ' చిత్రంలో కావాల్సినంత రొమాంటిక్ మసాలా సన్నివేశాలు ఉన్నాయని మనకు ట్రైలర్స్ చూస్తుంటే అర్ధమైంది. ఆ ట్రైలర్స్ లో అవసరాల చేసిన హాట్ హాట్ సీన్స్ మాత్రం సినిమాపై కొంచెం క్రేజ్ వచ్చేలా చేశాయి. అసలు అవసరాల టాలెంట్ కి ఏం తక్కువని ఇలాంటి సినిమాని ఒప్పుకున్నాడో అనేది మాత్రం శ్రీనివాస్ కే తెలియాలి. ఇక ఈ చిత్రంలో నటించిన హీరోయిన్స్ మిస్తి చక్రబర్తి, తేజశ్వి మదివాడ లు కూడా హాట్ హాట్ సన్నివేశంలో రెచ్చిపోయినట్లు పోస్టర్స్ ట్రైలర్స్ చూస్తుంటే తెలుస్తుంది. మరి ఈ హాట్ హాట్ అడల్ట్ కామెడీ చిత్రం 'బాబు బాగా బిజీ' ఎలాంటి హాట్ హాట్ కామెడీతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: అతని పేరు మాధవ్(శ్రీనివాస్ అవసరాల). సెక్స్‌కి ఎడిక్ట్ అయిపోయి అమ్మాయి కనబడితే చాలు అదే దృష్టితో చూస్తాడు. మాధవ్ కి ఉత్తేజ్ అనే స్నేహితుడు ఉంటాడు. అయితే ఎంతో మందితో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేసిన మాధవ్‌కి ఇప్పుడు 30 సంవత్సరాలు. గతంలోలా తనకు అమ్మాయిలు పడడం లేదని బాధపడుతూ వుంటాడు. దాంతో పెళ్ళి చేసుకోమని సలహా ఇస్తారు అతని ఫ్రెండ్స్. పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తారు. ఒకటి, రెండు, మూడు.. ఇలా మూడు సంబంధాల్ని తన ఓవర్ యాక్షన్‌తో చెడగొట్టుకున్న మాధవ్ నాలుగో పెళ్ళిచూపుల్లో మాత్రం డీసెంట్‌గా బిహేవ్ చెయ్యడం ద్వారా అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యగలుగుతాడు. ఆమె పేరు రాధ(మిస్తీ చక్రవర్తి). ఆమెకి కూడా ఒక లవ్ ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. పెళ్ళిచూపులు తర్వాత మాధవ్ ఆమెకు బాగా దగ్గరవుతాడు. పెళ్ళి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అయితే తను ప్లేబోయ్‌నని, సెక్స్‌కి ఎడిక్ట్ అయిపోయానని చెప్పాలని చాలా సార్లు ట్రై చేస్తాడు. కానీ, చెప్పలేకపోతాడు. రాధని పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయినప్పటికీ తన శృంగార లీలల్ని కొనసాగిస్తూనే వుంటాడు. మరి మాధవ్ పెళ్ళికి ముందే రాధకు తన గురించి అన్ని వివరాలు చెప్పాడా? దానికి రాధ ఎలా రియాక్ట్ అయ్యింది? రాధ లవ్ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ఇద్దరూ తమ తమ గతాల్ని మర్చిపోయి ఒక్కటయ్యారా? అనేది తెలుసుకోవాలంటే బాబు బాగా బిజిని వెండితెర మీద వీక్షించాల్సి ంధే.
నటీనటుల పనితీరు: శ్రీనివాస్ అవసరాల ప్లేబోయ్ క్యారెక్టర్‌లో ఫర్వాలేదు అనిపించినా తన పెర్‌ఫార్మెన్స్‌తో అంతగా ఇంప్రెస్ చెయ్యలేకపోయాడు. మాధవ్ ఎదురింట్లో వుండే చంద్రికగా సుప్రియ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. తన అందచందాలతో, అభినయంతో ఆమె కనిపించినంత సేపు ఆడియన్స్ రిలాక్స్ అవుతారు. రాధగా మిస్తీ చక్రవర్తి పెర్‌ఫార్మెన్స్ కూడా ఫర్వాలేదు. హీరో ఫ్రెండ్‌గా నటించిన ప్రియదర్శికి కామెడీ చేసే అవకాశం అంతగా రాలేదు. వచ్చినా ఆడియన్స్‌కి నవ్వు రాలేదు. మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి అంతగా ఏమీ లేదు.
సాంకేతిక వర్గం పనితీరు: డైరెక్టర్ నవీన్ మేడారం గురించి చెప్పాలంటే హిందీలో సూపర్‌హిట్ అయిన హంటర్‌ని అదే స్పీడ్‌తో యాజ్ ఇటీజ్‌గా తీసినా సినిమా సూపర్‌హిట్ అయ్యేది. కానీ, కథలో స్పీడ్ లోపించడం, కథనంలో కొత్తదనం లేకపోవడం వంటి విషయాలు సినిమాని మరింత వెనక్కి లాగాయి. స్లోగా కదిలే కెమెరా, స్లోగా మాట్లాడే ఆర్టిస్టులు, స్లోగా జరిగే కథ. ఇలా అన్ని విధాలా స్లో నే ఎక్కువ నమ్ముకున్నాడు డైరెక్టర్. దీనికంటే టీవీ సీరియల్సే చాలా ఫాస్ట్‌గా వుంటున్నాయన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెక్స్ బేస్‌తో అల్లిన కథతో చేసిన సినిమా కావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అవకాశం లేదు. పోనీ సెక్స్ సబ్జెక్ట్ అంటే యూత్ అయినా ఎట్రాక్ట్ అవుతారా అంటే అదీ లేదు. కెమెరా వర్క్ చాలా నార్మల్‌గా వుంది. సునీల్ కశ్యప్ చేసిన పాటల్లో రెండు ఫర్వాలేదు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అవకాశం చాలా తక్కువ. ఉన్నంతలో కూడా మ్యూజిక్ ఆకట్టుకునేలా లేదు. 2 గంటల 5 నిముషాలు వున్న సినిమాని స్పీడప్ చెయ్యాలంటే గంట సినిమా తీసెయ్యాలన్నట్టుగా వుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఎస్.బి.ఉద్దవ్‌కి కష్టపడే అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదు. ఇక ప్రొడక్షన్ వేల్యూస్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
ప్లస్ పాయింట్స్: సినిమాటోగ్రఫీ,నటీనటులు
మైనస్ పాయింట్స్: దర్శకుడు, కథ, కథనం, సంగీతం ఎడిటింగ్, అడల్ట్ కామెడీ