నటీనటులు: నాని, అను ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : గీత గొల్ల, పి. కిరణ్
దర్శకత్వం : విరించి వర్మ
ఈ మధ్యన నాని వరస హిట్లతో దూసుకు పోతున్నాడు. 'భలే భలే మగాడివోయ్' తో తన లక్కుని మార్చేసుకున్న నాని ఆ తర్వాత వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్మన్' సినిమాలతో నేచురల్ స్టార్ గా నాని మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. ఇక దర్శకుడు విరంచి వర్మతో జతగట్టి ఇప్పుడు 'మజ్ను'తో మరో హిట్ సాధించేందుకు రెడీ అయ్యాడు నాని. దర్శకుడు విరంచి వర్మ 'ఉయ్యాలా జంపాల'తో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు. ఇక హీరోయిన్స్ ఇమ్మానుయేల్, ప్రియా శ్రీ ఇద్దరూ కొత్తవారే. మరి వరసగా హిట్ బాట పట్టిన నాని ఎంతవరకు మజ్నుతో ప్రేక్షకులను మెప్పించగాడో... విరంచి వర్మ తన రెండో సినిమాతో ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలిగాడో చూద్దాం. ఇక కొత్త హీరోయిన్స్ ప్రేక్షకులను ఎంతవకు మెప్పించగలిగారో .... ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'మజ్ను' మూవీ ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అయ్యిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: బిటెక్ పూర్తి చేసుకుని భీమవరం నుండి హైదరాబాద్ కి వచ్చి సినిమాలపై ఫ్యాషన్ తో ఆదిత్య (నాని) డైరెక్టర్ రాజమౌళి దగ్గర 'బాహుబలి' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటాడు. అదే సిటీ లో IT SAP స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న సుమ (ప్రియా శ్రీ) తో పరిచయమవుతుంది. మొదటి పరిచయం లోనే ఆమె ప్రేమలో పడతాడు ఆదిత్య. ఇక ఆమె ప్రేమను పొందే ప్రయత్నంలో చాల నిజాయితీగా మారిపోతాడు. అలా నిజాయితీగా ఉంటూ సుమ తో అన్ని విషయాలను పంచుకుంటాడు. ఆ క్రమం లోనే తన పాత లవ్ స్టోరీ గురించి సుమతో చెప్తాడు. అతనంత నిజాయితీగా అన్ని విషయాలు తనకు చెప్పడంతో సుమ కూడా ఆదిత్యని ప్రేమిస్తుంది. వీరిద్దరూ ఆలా లవ్ లో వుండగా ఆదిత్య పాత లవర్ కిరణ్ (అను ఇమ్మానుయేల్) నాని లైఫ్ లోకి వస్తుంది. మరి నాని ఇద్దరిలో ఎవరిని లవ్ చెయ్యాలో అని సందిగ్ధం లో పడిపోతాడు. అసలు ఆదిత్య కిరణ్ తో ఎందుకు లవ్ ని బ్రేక్ చేసుకుంటాడు? అసలేం జరిగింది? ఇద్దరిమధ్యన ఆదిత్య ఎందుకు నలిగిపోవాల్సి వస్తుంది? కిరణ్ ఎంటర్ అయ్యాక సుమ ని ఏం చేస్తాడు? అసలు ఆదిత్య సుమని పెళ్లి చేసుకుంటాడా లేక కిరణ్ ని చేసుకుంటాడా? అనేది మాత్రం వెండి తేరా మీద చూడాల్సిందే.
పనితీరు: నాని ఆదిత్య పాత్రలో నటించలేదు జీవించేసాడు. అంతలా ఆ పాత్రకు న్యాయం చేసాడనే చెప్పాలి. ఇక సినిమా చూసిన తర్వాత నేచురల్ స్టార్ అన్న బిరుదు నాని కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని అందరూ చెబుతారు. ఆదిత్య కేరెక్టర్ కి నాని కరెక్ట్ గా సరిపోయి ఫిట్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక డైలాగ్ డెలివరీ తో నాని ఏంటో మరో సారి నిరూపించాడు.. ఇక విరంచి వర్మ పాత కథనే ఎంచుకున్నప్పటికీ దాన్ని చాల అందం గా ప్రెజెంట్ చేసాడనే చెప్పాలి. రైటర్ గా స్టోరీ ని ఎలా రాశాడో డైరెక్టర్ గా కూడా స్క్రీన్ పై అంతే ఆవిష్కరించాడు అని చెప్పుకోవాలి. భీమవరం పరిసర ప్రాంతాల్లో తీసిన సీన్స్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ప్రేమ కథను చాల సహజం గా చూపించి దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే వీరిద్దరూ కొత్త భామలవ్వడం తో సినిమాకు ఫ్రెష్ లుక్ ని తీసుకొచ్చారు. హాఫ్ సారీ లో అను ఇమ్మానుయేల్ చాల క్యూట్ గా కనిపించింది.. కిరణ్ పాత్రని చాలాగా చక్కగా పోషించింది.. సుమ పర్వాలేదనిపించుకుంది.. పోసాని, వెన్నెల కిషోర్ లు ఎప్పటిలాగానే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగా సెకండ్ హాఫ్ లో రాజమౌళి గెస్ట్ అప్పీరెన్స్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ మీద వేసిన కామెడీ పంచ్ లు బాగా పేలాయనే చెప్పొచ్చు. ఇక రాజ్ తరుణ్ స్పెషల్ గా గెస్ట్ పాత్రలో కనిపించి ఈ సినిమాకి హెల్ప్ అయ్యాడనే చెప్పొచ్చు.
మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఆర్ ఆర్ మాత్రం పర్వాలేదనిపించాడు.ఇక సినిమాటోగ్రఫీ జ్ఞాన శంకర్ పర్వాలేదనిపించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. నిర్మాతల విషయానికొస్తే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాకి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ చాల బాగా తెరకెక్కించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ విషయానికొచ్చేసరికి కొంచెం తడబడ్డాడనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్: నాని నటన, డైరెక్టర్, కామెడీ, మ్యూజిక్
మైనస్ పాయింట్స్: కథ, కథనం, హీరోయిన్స్ కూడా ఒక కారణం
రేటింగ్ : 2.5/5