నటీనటులు: విజయ్ ఆంటోనీ, మియా జార్జ్, త్యాగరాజన్
సంగీతం: విజయ్ ఆంటోని
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి
దర్శకత్వం: జీవశంకర్
డబ్బింగ్ చిత్రం 'నకిలి'తో హీరోగా పరిచయమైన విజయ్ ఆంటోని ఆ తర్వాత వచ్చిన' డా. సలీమ్, బిచ్చగాడు' చిత్రాలు సూపర్‌హిట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. 'బిచ్చగాడు' తర్వాత ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన 'బేతాళుడు' అనుకున్నంత హిట్ అవ్వలేదు. లేటెస్ట్‌గా 'నకిలి 'దర్శకుడు జీవశంకర్ దర్శకత్వంలో రూపొందిన యమన్‌తో మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యడానికి వచ్చాడు విజయ్ ఆంటోనీ. తమిళ్‌లో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగులో అందించారు. విజయ్ ఆంటోని ఇప్పటి వరకు చేయని పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు విడుదలైంది. 'బిచ్చగాడు'తో హీరోగా మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్న విజయ్ ఆంటోని 'యమన్'తో ఎలాంటి హిట్ కొట్టాడో.. నకిలి దర్శకుడు జీవశంకర్.. విజయ్ ఆంటోనికి మరో సూపర్‌హిట్ ఇవ్వగలిగాడా? అనే విషయాలు సమీక్షలో తెలుసుకుందాం.
కథ: దేవరకొండ అనే గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్న గాంధీ(విజయ్ ఆంటోని) అహల్యను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. దీంతో అహల్య అన్నయ్య గాంధీపై పగ పెంచుకుంటాడు. గాంధీ, అహల్యలకు కొడుకు పుడతాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా అహల్య ఊరు వెళ్ళి చెప్పాలనుకుంటాడు. అదే క్రమంలో గాంధీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధపడతాడు. ఇది రుచించని పాండురంగారావు అనే వ్యక్తి అహల్య అన్నయ్య మనసులో దురాలోచన కలిగిస్తాడు. ఒక పథకం ప్రకారం గాంధీని హత్య చేస్తారు. ఇది విని తట్టుకోలేని అహల్య ఆత్మహత్య చేసుకుంటుంది. కట్ చేస్తే పెరిగి పెద్దవాడైన గాంధీ కొడుకు అశోకచక్రవర్తి(విజయ్ ఆంటోని) తన తాతయ్యతో కలిసి జీవనం సాగిస్తుంటాడు. తాతయ్యకు క్యాన్సర్ అని తేలడం, ఆపరేషన్‌కి మూడు లక్షల అవసరం రావడంతో డబ్బు కోసం తను చేయని నేరాన్ని నెత్తిన వేసుకొని జైలుకు వెళ్తాడు అశోక్. అక్కడ పరిచయమైన నరసింహ అనే వ్యక్తి తన కోసం పనిచేస్తే జైలు నుంచి విడిపిస్తానని చెప్తాడు. చెప్పినట్టుగానే అశోక్ విడుదలవుతాడు. ప్రత్యర్థులైన నరసింహ, సాంబల రగులుతున్న పగకి అశోక్ ఆజ్యం పోస్తాడు. మాజీ మంత్రి కరుణాకర్(త్యాగరాజన్), మంత్రి పాండురంగారావుల అండతో ఒక్కో మెట్టు ఎదుగుతుంటాడు అశోక్. ఈ క్రమంలో అశోక్ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలనుకుంటాడు. గాంధీని పోలివున్న అశోక్‌ని చూసి పాండు ఎలా రియాక్టయ్యాడు? అశోక్ ఎమెల్యేగా పోటీ చేయడంపై కరుణాకర్, పాండు ఎలా స్పందించారు? అందర్నీ పక్కకు నెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్ మినిస్టర్ ఎలా అయ్యాడు? అనేది తేరా మీద చూడాల్సిందే.
నటీనటులు పనితీరు: గత చిత్రాలతో తన సహజ సిద్ధమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్న విజయ్ ఆంటోని ఈ చిత్రంలో మరోసారి తన పెర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు. ఇప్పటివరకు చేయని పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో గాంధీగా, అశోకచక్రవర్తిగా విజయ్ ఆంటోని తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాలోని ప్రతి ఫ్రెమ్ లో విజయ్ ఆంటోని కనిపిస్తాడు. మాజీమంత్రి కరుణాకర్‌గా నటించిన త్యాగరాజన్, మినిస్టర్ పాండురంగారావుగా నటించిన అరుళ్ జోతి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలోని మిగతా నటీనటులు తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడి గురించి చెప్పాలంటే మంచి కథ, మంచి గ్రిప్పింగ్ వున్న స్క్రీన్‌ప్లేతో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఎక్కడా బోర్ అనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ నుంచి చక్కని పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచినవి కథ, స్క్రీన్‌ప్లే, నటీనటుల పెర్‌ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. విజయ్ ఆంటోని మ్యూజిక్ చాలా బాగుంది. పాటలన్నీ వినసొంపుగా వున్నాయి. ఈ సినిమాకి కథ ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుందో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో విజయ్ ఎంతో కేర్ తీసుకొని తన మ్యూజిక్‌తో ప్రతి సీన్‌ని హైలైట్ అయ్యేలా చేశాడు. ఎడిటర్ వీరసెంథిల్‌రాజ్ సినిమాని పర్‌ఫెక్ట్‌గా ఎడిట్ చేశాడు. మాటలు,
ప్లస్ పాయింట్స్: విజయ్ ఆంటోనీ నటన, కథ, స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, ఎడిటింగ్, కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం
రేటింగ్: 2.5/5