'రంగుల‌రాట్నం' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2018-01-14 06:41 GMT

టాలీవుడ్‌లో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ న‌టించిన లేటెస్ట్ సినిమా రంగుల‌రాట్నం. ఉయ్యాల జంపాల లాంటి హిట్ త‌ర్వాత అక్కినేని నాగార్జున త‌న అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజ్ హీరోగా రంగుల‌రాట్నం సినిమాను నిర్మించాడు. టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి, బాల‌య్య జై సింహా లాంటి పెద్ద సినిమాల‌తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన గ్యాంగ్ సినిమా ఉన్నా కూడా నాగ్ త‌న సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో రంగుల‌రాట్నం సినిమాను ఆదివారం ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చాడు. ఈ రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రీమియ‌ర్ షో త‌ర్వాత ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో ? చూద్దాం.

రాజ్‌త‌రుణ్‌కు బీ, సీ సెంట‌ర్ల‌లో కంటే ఏ సెంట‌ర్ల‌తో పాటు మ‌ల్టీఫ్లెక్స్ ఆడియెన్స్‌ల‌లో ఎక్కువ మార్కెట్‌, క్రేజ్ ఉంది. రాజ్ సినిమాలు అన్నీ ఈ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌తో పాటు యూత్‌ను టార్గెట్‌గా చేసుకుని ఉంటాయి. రంగుల‌రాట్నం సినిమా కూడా అలాంటి కోవ‌లోదే. రంగుల‌రాట్నంలో హీరో రాజ్‌త‌రుణ్‌తో పాటు క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సూప‌ర్‌.

ఫ‌స్టాఫ్‌లో రాజ్‌త‌రుణ్ - ప్రియ‌ద‌ర్శి క‌లిపి చేసే కామెడీ హైలెట్‌. ఇక హీరోయిన్ చిత్ర శుక్ల - రాజ్ మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ సీన్ల‌ను బాగా డిజైన్ చేశారు. ఓవ‌రాల్‌గా ల‌వ్ సీన్లు, కామెడీ సీన్ల‌తో ఫ‌స్టాఫ్ బాగానే ఉంటుంది. ప్రేమక‌థాంశంతో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో సినిమా స్లోగానే మూవ్ అవుతుంది. ఇక సెకండాఫ్‌లో మ‌రీ సాగ‌దీత ఎక్కువ కావ‌డంతో పెద్ద మైన‌స్‌గా మారింది.

ఇక ల‌వ్‌, ఎమోష‌న్‌, సెంటిమెంట్ టైప్ సినిమాలు ఇష్ట‌ప‌డేవారికి మాత్ర‌మే ఈ రంగుల‌రాట్నం న‌చ్చుతుంది. మొత్తంగా పండగ వేళ రాజ్ తరుణ్ ‘ఏ’ సెంటర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది. ఇక బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌తో పాటు మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా న‌చ్చ‌డం క‌ష్ట‌మే. మ‌రి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాలు తేలిపోవ‌డంతో ఈ అవకాశాన్ని రంగుల‌రాట్నంతో రాజ్ ఎంత వ‌ర‌కు యూజ్ చేసుకుంటాడో ? చూడాలి. మ‌రి కొద్ది సేపట్లోనే పూర్తి రివ్యూతో క‌లుద్దాం.

Similar News