రాజా ది గ్రేట్ ఫ‌స్ట్ రివ్యూ

Update: 2017-10-18 02:35 GMT

ర‌వితేజ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్ చూసి రెండేళ్లు దాటిపోయింది. ఎప్పుడో రెండేళ్ల‌కు ముందు దీపావ‌ళికి బెంగాల్ టైగ‌ర్‌గా వ‌చ్చిన ర‌వితేజ ఫామ్‌లో లేడు. కిక్‌ 2, బెంగాల్ టైగ‌ర్ రెండు సినిమాలు ఆక‌ట్టుకోకపోవ‌డం, లాంగ్ గ్యాప్ తీసుకోవ‌డంతో మ‌నోడి మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. అయితే తాజాగా రవితేజ రాజా ది గ్రేట్ స్టార్ట్ చేయ‌గానే అంచ‌నాలు పెరిగాయి. ఇందుకు కార‌ణం ప‌టాస్‌, సుప్రీమ్ లాంటి రెండు హిట్‌ సినిమాలు ఇచ్చిన డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డం ఒక‌టి అయితే అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించ‌డం మ‌రో పాయింట్‌. ఇక ఈ రోజు రిలీజ్ అవుతోన్న రాజా ది గ్రేట్ ఓవ‌ర్సీస్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఓ రొటీన్ రివేంజ్ డ్రామానే క‌థ‌గా తీసుకున్నాడు. అనిల్ గ‌త రెండు సినిమాలు చూసుకున్నా క‌థాప‌రంగా కొత్త‌గా ఏం ఉండ‌వు. ఈ సినిమాకు కూడా త‌న ప‌టాస్‌, సుప్రీమ్ పంథానే ఫాలో అయ్యాడు. రొటీన్ రివేంజ్ డ్రామా తీసుకుని దానికి బ‌ల‌మైన కామెడీ సీన్లు జోడించి కామెడీ గ్రాఫ్, సినిమా స్పీడ్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా బండి లాగించేశాడు.

ప్ర‌థ‌మార్థం అంతా హీరో-హీరోయిన్ల మ‌ధ్య స‌న్నివేశాలు, ర‌వితేజ అంధుడిగా చేసే స‌న్నివేశాలు, ర‌వితేజ - పృథ్వి - రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ, హీరోయిన్‌ను ఇబ్బందుల నుంచి సేవ్ చేసేందుకు ర‌వితేజ చేసే ప్ర‌య‌త్నాలు బాగున్నాయి. ఇంట‌ర్వెల్ యాక్ష‌న్ బ్యాంగ్ హైలెట్. ద్వితియార్థం విష‌యానికి వ‌స్తే సినిమా సా.....గ‌దీసిన‌ట్టు ఉంది. అయితే ద‌ర్శ‌కుడు వాడిన టెక్నిక్ ఏంటంటే కామెడీ మెయింటైన్ చేస్తూ గ్రాఫ్ ఎక్క‌డా ప‌డిపోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు.

ప్ల‌స్ పాయింట్స్ :

ర‌వితేజ ఎన‌ర్జిటిక్ న‌ట‌న - హీరోయిన్ మెహ్రిన్ బ్యూటీఫుల్ అందాలు - ఫ‌స్టాఫ్ - పొట్ట చెక్క‌ల‌య్యే కామెడీ - సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ :

సెకండాఫ్ - కాస్త ఎక్కువైన ర‌న్ టైం - రొటీన్ రివేంజ్ డ్రామా

ఫైన‌ల్‌గా...

ప్రీమియ‌ర్ షోల టాక్ ప్రకారం రాజా ది గ్రేట్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అన్న టాక్ వ‌స్తోంది. మ‌రి పూర్తి రివ్యూతో మ‌ళ్లీ క‌లుద్దాం.

Similar News