లంక మూవీ రివ్యూ

Update: 2017-04-21 11:25 GMT

నటీనటులు: రాశి, సాయి రోన‌క్‌, ఐనా సాహ‌,స‌త్యం రాజేష్‌, స‌త్య

సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌

నిర్మాత‌లు: నామ‌న దినేష్‌, నామ‌న విష్ణుకుమార్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: శ్రీముని

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాశి టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించింది. అయితే ఆమెకు అనతికాలంలోనే శరీర బరువు కారణంగా హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే రాశి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత 'కళ్యాణ వైభోగమే' లో హీరోయిన్ కి అమ్మ కేరెక్టర్ చేసిన రాశి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'లంక'లో నటించింది. ఈ చిత్రానికి రాశి భర్త శ్రీముని డైరెక్టర్. మరి రాశిని మెయిన్ కేరక్టర్ లో చిత్రీకరించిన 'లంక 'చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ పోస్టర్స్, టీజ‌ర్ తో ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తి రేపింది. మరి భారీ అంచనాలు అనలేముగాని మంచి అంచనాల మధ్యన రాశి నటించిన 'లంక' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో రాశి ఫేట్ ఎలా ఉందొ ఈ చిత్రంతో తెలిసిపోతుంది. రాశిని ఇండస్ట్రీలో నిలబెట్టడానికి రాశి భర్త శ్రీముని చేసిన ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యిందో సమీక్షలో తెలుసుకుందాం

కథ: కేరళలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి(ఐనా సాహా) ఒక పర్సనల్ పని మీద హైదరాబాద్ వస్తుంది. అక్కడ దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ఒక యువకుడు (సాయిరోన‌క్‌) డైరెక్షన్ లో ఒక షార్ట్ ఫిలింలో నటించాలని అనుకుంటుంది. ఇక ఇక్కడ షార్ట్ ఫిలిం లో నటిస్తున్నప్పుడు తానొక స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెడుతుంది. షార్ట్ ఫిలిం లొకేషన్స్ కోసం యూనిట్ మొత్తం రెబాకా విలియ‌మ్స్‌(రాశి) ఇంటికి వెళతారు. అయితే రేబాక కి ఒక విచిత్రమైన మనస్సు ఉంటుంది. టెలిప‌తి ద్వారా లేని పిల్ల‌ల‌ను ఉన్న‌ట్లుగా ఊహించుకుని బతికేస్తుంటుంది. ఇక ఆ షార్ట్ ఫిలిం పూర్తయ్యేలోపు స్వాతి, రేబాకా మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలాంటి సమయంలో సాయిరోన‌క్‌, స్వాతి ప్రేమలో పడతాడు. కానీ స్వాతి అందరిలాంటి అమ్మాయి కాదని ఆమె ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అని సాయిరోన‌క్‌ కి తెలుస్తుంది. ఇంతలోపులో స్వాతి ఎవరికీ కనబడకుండా పోతుంది. కానీ పోలీస్ లు మాత్రం సాయిరోన‌క్‌ అతని ఫ్రెండ్ స్వాతి ని చంపేశారని అరెస్ట్ చేస్తారు. ఇంతలోపులో రేబాక పోలీస్ స్టేషన్ కి వచ్చి తానే స్వాతిని అని చెబుతుంది. అసలు రేబాక స్వాతిగా ఎలా ఊహించుకుంటుంది? నిజంగానే స్వాతి చనిపోతుందా? రెబాకాకి స్వాతికి ఉన్న సంబంధం ఏమిటి? స్వాతిని సాయిరోన‌క్‌ పెళ్లాడాడా? ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా లంక చిత్రాన్ని వెండితెరమీద వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు: రెబెకాగా రాశి పెర్‌ఫార్మెన్స్‌ పార్టులు పార్టులుగా చూస్తే బాగానే వుంది అనిపించినా దాని వల్ల సినిమాకి హెల్ప్‌ అయింది ఏమీ లేదు. హీరోయిన్‌గా ఎన సహ లుక్స్‌ పరంగా గానీ, పెర్‌ఫార్మెన్స్‌ పరంగా గానీ ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్‌ హాఫ్‌లో ఏదో ఓ రకంగా సినిమాని నడిపించే ఉద్దేశంతో సాయి, సత్య, సుదర్శన్‌లతో చేయించిన కామెడీ పరమ రొటీన్‌గానూ, విసుగు పుట్టించేదిగానూ వుంది. రెగ్యులర్‌గా కనిపించే పోలీస్‌ క్యారెక్టర్‌లో సుప్రీత్‌, రెండు రకాల క్యారెక్టర్స్‌లో కనిపించే సిజ్జు పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. సినిమా మొత్తంలో రాశి తప్ప చెప్పుకోదగ్గ ఆర్టిస్టుగానీ, పెర్‌ఫార్మెన్స్‌గానీ మనకు కనిపించదు.

సాంకేతిక వర్గం పనితీరు: డైరెక్టర్‌ శ్రీముని కథని ఆసక్తికరంగా ఎలా నడపాలి అనే దాని కంటే ప్రేక్షకుల్ని ఎలా కన్‌ఫ్యూజ్‌ చెయ్యాలి, ట్విస్టుల మీద ట్విస్టులతో వారిని మెదడుకి ఎలా పని చెప్పాలి అనే విషయంలోనే ఎక్కువ శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తుంది.కథ, కథనం, ఆర్టిస్టుల సెలెక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌... ఇలా ఏ విషయంలోనూ అతనికి క్లారిటీ లేదనిపిస్తుంది. సినిమా ఆరంభంలోనే హీరోతోపాటు కమెడియన్స్‌ నవ్వించే ప్రయత్నాలు చాలా లెంగ్తీగా చేసి ఆడియన్స్‌కి బోర్‌ కొట్టించారు. అనవసరమైన సీన్స్‌, అర్థం కాని డైలాగ్స్‌తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్‌. ఇప్పటి వరకు టెలిపతి కాన్సెప్ట్‌తో తెలుగులో ఏ హార్రర్‌ మూవీ రాకపోవడం వల్ల పాయింట్‌ కొత్తగా అనిపించే అవకాశం వుంది. అయితే దాన్ని కథకి లింక్‌ చెయ్యడంలో, కామన్‌ ఆడియన్‌కి అర్థమయ్యేలా తియ్యడంలో ఫెయిల్‌ అయ్యాడు. రవికుమార్‌ ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. కొన్ని షాట్స్‌ చాలా బాగున్నాయి. శ్రీచరణ్‌ మ్యూజిక్‌ కూడా ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వున్నంతలో బాగానే అనిపించినా కొన్ని చోట్ల రణగొణ ధ్వనిలా వినిపించింది. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకొని కొన్ని లెంగ్తీ సీన్స్‌ కట్‌ చేసి వుంటే బాగుండేది. ప్రొడక్షన్‌ గురించి చెప్పుకోవాలంటే అన్‌ కాంప్రమైజ్డ్‌గా సినిమాని తీసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని గ్రాఫిక్‌ షాట్స్‌ని రిచ్‌గా చూపించగలిగారు.

ప్లస్ పాయింట్స్: రాశి నటన, కథ, క్లైమాక్స్,

మైనస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫస్ హాఫ్

రేటింగ్: 2.25 /5

Similar News