ప్రొడక్షన్ హౌస్: మారుతీ టాకీస్
నటీనటులు: రక్షిత్, స్వాతి, అలీ, సాయి, ప్రియదర్శిని, ధనరాజ్, జీవ, రాజా రవీంద్ర, మురళి శర్మ, సత్య కృష్ణ
సంగీతం: కే
నిర్మాత: మారుతి
దర్శత్వం: బి చిన్ని కృష్ణ
లండన్ బాబులు సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి పెద్దగా అంచనాలు లేకుండానే సినిమా చిత్రీకరణ జరుపుకుంది. ఎప్పుడైతే ఈసినిమా మారుతి నిర్మాణ సంస్థ నుండి వస్తుందని తెలిసిందో.. అప్పుడే సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే మారుతి నిర్మాణ సంస్థలో గతంలో వచ్చిన ప్రేమ కథా చిత్రం కామెడీ ఎంటెర్ టైనెర్ గా ఎంతటి హిట్టో అందరికి తెలిసిందే. మారుతి ఆ సినిమాని ప్రొడ్యూస్ చెయ్యడమేకాదు... అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నాడు. అలాగే మారుతి ఈ మధ్యన కామెడీ ఎంటర్ టైన్ మెంట్స్ సినిమాలను డైరెక్ట్ చేస్తూ విజయాలతో దూసుకుపోతున్నాడు. యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా సినిమాలను తెరకెక్కించగల కెపాసిటీ ఉన్న మారుతి నుండి లండన్ బాబులు సినిమా రావడం అనేది ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి మొదటి కారణం. అటు దర్శకత్వ బాధ్యతలతో పాటే... ఇటు నిర్మాణ రంగంలోను దూసుకుపోతున్న మారుతి ఈ చిత్రాన్ని బి చిన్ని కృష్ణ దర్శకత్వంలో కొత్త హీరో రక్షిత్ తో తెరకెక్కించాడు. అటు హీరోయిన్ స్వాతి కూడా తమిళ సినిమాలతో మంచి ఫామ్ లో ఉండడమే కాదు... కార్తికేయా, త్రిపుర వంటి హిట్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఒక తమిళ చిత్రాన్ని బేస్ చేసుకుని.... కామెడీని ప్రధానంగా చేసుకుని ఈ లండన్ బాబులు చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు బి చిన్ని కృష్ణ. మరి మారుతి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
గాంధీ(రక్షిత్) పండు (సత్య అక్కల) ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ లండన్ వెళ్లి సెట్ అవ్వాలని కలలు కనడమే కాదు డిసైడ్ అవుతారు. లండన్ వెళ్ళడానికి గాను అంతర్వేది నుండి హైదరాబాద్ కి ప్రయాణమవుతారు. అయితే లండన్ వెళ్ళడానికి వారు అడ్డదారిని ఎన్నుకుంటారు. సక్రమంగా లండన్ వెళ్ళాలి అంటే చాలా ఖర్చు పెట్టాలని.. వారు అడ్డదారులు వెతుక్కుంటారు. అందులో భాగంగానే దొంగ పాస్ పోర్ట్, వీసాలు తయారు చేసే ట్రావెల్ ఏజెంట్ జీవ ని కలుస్తారు. అతని ద్వారా లండన్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. అయితే స్నేహితుల్లో ఒకరైన పండుకి లండన్ వీసా వస్తుంది కానీ.. గాంధీకి మాత్రం వీసా రిజెక్ట్ అవుతుంది. అయితే ఎలాగైనా లండన్ వెళ్ళాలన్న ఉద్దేశంతో గాంధీ ఒక నాటకాల కంపెనీలో చేరతాడు. అయితే ఆ నాటకాల ట్రూప్ లండన్ లో ఒక అవార్డు అందుకోవడానికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. లండన్ వెళ్ళడానికే అందులో చేరిన గాంధీ వారితో పాటే లండన్ వెళ్లాలనుకుంటాడు. మరి ఇన్ని అడ్డంకులు ఎదుర్కుంటూ గాంధీ లండన్ కి వెళతాడా? అసలు గాంధీకి లండన్ అంటే అంత పిచ్చి ఎందుకు? లండన్ వెళితేనే సెటిల్ అవుతామని వారికి ఎవరైనా చెబుతారా? అనే విషయాలు తెలియాలి అంటే.. లండన్ బాబులు సినిమా స్క్రీన్ మీద చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
రక్షిత్ హీరోగా పరిచయమైన సినిమా లండన్ బాబులు. అతనికి ఈ సినిమా మొదటి సినిమానే అయినా ఎంతో పరిణితి ఉన్న హీరోలా నటించాడు. లండన్ వెళ్లాలనే ఆశతో అతను చేసే పనులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో రక్షిత్ ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడు. రక్షిత్ బాడీ లాంగ్వేజ్ తో... మంచి డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేసాడు. అద్భుతమైన కామెడీని పండించాడు. ఒక్క కామెడీతోనే కాదు.. మంచి నటనతో రక్షిత్ బాగా ఆకట్టుకున్నాడు. రక్షిత్ తో పోటీగా అని చెప్పలేం గాని.. స్వాతి కూడా జర్నలిస్ట్ పాత్రలో మెప్పించింది. అందంతో, నటనతో బాగా మెప్పించింది. ధన రాజ్, అలీ ల కామెడీ లండన్ బాబులు సినిమాకే హైలెట్ అనేలా వుంది. ఇక మిగిలిన ప్రియదర్శిని, జీవ, రాజా రవీంద్ర, మురళి శర్మ, సత్య కృష్ణ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
తమిళంలో సక్సెస్ అయినా ఆండవం కట్టాలి అనే సినిమాకి పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా తెలుగు తనం ఉట్టిపడేలా ... ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఎలాంటి ప్రయోగాలు జోలికి పోకుండా ఈచిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఎక్కడా కొదవ లేకుండా తెరకెక్కించి శెభాష్ అనిపించుకున్నాడు దర్శకుడు చిన్ని కృష్ణ. అయితే ఈసినిమా మొత్తం మారుతి మార్క్ యూత్ ఎలిమెంట్స్ తోపాటు కామెడీ కూడా కనబడుతుంది. మారుతి ఆధ్వర్యంలో దర్శకుడు చిన్ని కృష్ణ ఒక చిన్న పాయింట్ ని తీసుకుని కథగా మలచడంలో 100 శాతం సక్సెస్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకుడు కోరుకునే విధముగా దర్శకుడు స్క్రీన్ ప్లే ని నడిపించాడు.
టెక్నీకల్ గా...
లండన్ బాబులు సంగీతం విషయానికొస్తే... కే అందించిన పాటలు పర్వాలేదనిపించాయి. కే ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. లండన్ బాబులు లో కొన్ని సీన్స్ ని హైలెట్ చెయ్యడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రముఖ పాత్ర వహించింది. అలాగే ఈ సినిమాకి మరో ప్రధానమైన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ పని తీరు అదుర్స్. అనేక సీన్స్ ని చాలా సహజ సిద్ధంగా చూపించడంలో సినిమాటోగ్రఫీ పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే.. ఎడిటింగ్ విషయంలో మరికాస్త శ్రద్ధ అవసరం. ఎందుకంటే కొన్ని సీన్స్ ని డ్రాగ్ చేసినట్లుగా అనిపిస్తుంది. అలాగే దర్శకుడు చిన్ని కృష్ణ స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే విషయంలో మరికొంచెం శ్రద్ద పెడితే బావుండేదనిపిస్తుంది. ఎందుకంటే అక్కడక్కడా కొన్ని సీన్స్ రిపీట్ అయ్యాయా అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, రక్షిత్ నటన, కామెడీ, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్.
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్ (కొన్ని డ్రగ్స్) , అనుకున్నంత కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం.
రేటింగ్: 2 .5 /3