నటీనటులు: రాహుల్, మహిమ, అజయ్ ఘోష్, కాశి విశ్వనాథ్
మ్యూజిక్: అచ్చు
నిర్మాత: శ్రేయాస్ శ్రీనివాస్, తుమ్ము ఫణి కుమార్
దర్శకత్వం: వేణు మడికంటి
'హ్యాపీడేస్' తో తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ ఆ తర్వాత చేసిన సినిమా అతనికి నిరాశనే మిగిల్చింది. 'హ్యాపీడేస్' చిత్రంలో చాలా సన్నగా కనబడ్డ రాహుల్ ఈ 'వెంకటాపురం' చిత్రంకోసం బాడీ ని బాగా పెంచి సిక్స్ ప్యాక్ చేసాడు. చాలా ఏళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ వేణు మడికంటి డైరెక్షన్ లో రాహుల్ ఈ 'వెంకటాపురం' చేసాడు. ఈ చిత్రం మొదలైనప్పటినుండి... ఫస్ట్ లుక్ వరకు సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఒకే ఒక్క టీజర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచగలిగింది. ఈ అంచనాలతోనే మరో హీరో శర్వానంద్ నటించిన 'రాధా' చిత్రంతో పాటు ఈ రోజు 'వెంకటాపురం' ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి హిట్ హీరోతో రాహుల్ పోటీ పడడం కష్టమైన పనే. కానీ సినిమాపై ఉన్న నమ్మకంతోనే శర్వా కి ఎదురొడ్డి నిలుస్తున్నాడు. అలాగే మరోపక్క 'బాహుబలి' సునామి ఉండనే వుంది. ఏప్రిల్ 28 న విడుదలైన 'బాహుబలి' చిత్రం ఇప్పటికీ బాక్స్ఆఫీస్ ని దున్నేస్తూనే వుంది. మరి సినిమాపై ఏ మాత్రం నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా 'బాహుబలి' సునామీలో 'వెంకటాపురం' కొట్టుకుపోవడం ఖాయమని తెలిసినా ఏ ధైర్యంతో బరిలోకి దిగుతున్నారో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: పోలీస్ రంజిత్ కుమార్ స్నేహితుడు (కాశి విశ్వనాథ్) తన కూతురు చిత్ర(మహిమ) కనిపించకుండా పోయిందని పోలీస్ లకు కంప్లైంట్ చేస్తాడు. ఈ కేసును వెంకటాపురం ఎస్సై దుర్గా ప్రసాద్(అజయ్ ఘోష్) హ్యాండిల్ చేస్తాడు. దుర్గా ప్రసాద్ ఇన్వెస్టిగేషన్ లో చిత్ర చనిపోయిందని.... ఆ డెడ్ బాడీ భీమిలి బీచ్ లో ఉందని కనుక్కుంటాడు. అయితే ఆ డెడ్ బాడీ చిత్రదే అని కనిపెట్టిన పోలిసులు చిత్రాని చంపింది ఆమె బాయ్ ఫ్రెండ్ ఆనంద్(రాహుల్) అని అనుమాన పడతారు. పోలిసుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఆనంద్ కూడా కొన్ని పనులు చేస్తుంటాడు. మరి నిజంగానే ఆనంద్, చిత్రని చంపుతాడా? ప్రేమించిన చిత్రను ఆనంద్ చంపాల్సిన అవసరం ఏమిటి? అసలు ఆ డెడ్ బాడీ నిజంగా చిత్రదేనా? అసలు చిత్ర మరణానికి కారణం ఎవరు? కథలో ఉన్న ట్విస్ట్ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల నటన: రాహుల్, ఆనంద్ మంచి నటన ప్రదర్శించాడు. ఎక్స్ప్రెషన్స్ లో వైవిధ్యంగా ఆకట్టుకున్నాడు. ఒక బాయ్ ఫ్రెండ్ గా లవర్ గా బాగా మెప్పించాడు. అయితే తనలోని నటుడిని పూర్తిగా ఆవిష్కరించే అవకాశం రాహుల్ కి దక్కలేదు. అయినా ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ తో రాహుల్ బాగానే మెప్పించాడు. ఇక హీరోయిన్ మహిమ కూడా చిత్ర పాత్రలో ఒదిగిపోయింది. స్టూడెంట్ గా బాగా మెప్పించింది. కానీ రాహుల్ కన్నా ఆమె వయసులో బాగా చిన్న అమ్మాయిలా కనబడి కాస్త ఇబ్బంది పెట్టింది. ఇక మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు వేణు మడికంటి ఓ థ్రిల్లర్ తో ప్రేక్షకులని ఆకట్టుకోవాలని ఆసక్తికర కథాంశంతో కథను ప్రారంభించాడు. అయితే దర్శకుడు చేసిన థ్రిల్లర్ ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. అసలు కథను ప్రెజెంట్ చేయకుండా, హీరోయిన్, హీరోల మధ్యన జరిగే రొమాంటిక్ యాంగిల్ ని ఎక్కువగా చూపించడానికి ఆసక్తి చూపించాడు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ప్రేకులకు పెద్ద పరీక్షే. బాగా బోర్ కొట్టిన్చేసాడు. అసలు లాజిక్ లేని కథ, కథనంతో దర్శకుడు ప్రేక్షకులను కొన్నిసార్లు థ్రిల్ చేసినా కొన్నిసార్లు చిరాకు పెట్టాడు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే, అచ్చు సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేదనే చెప్పాలి, బ్యాగ్రౌండ్ స్కోర్ కొద్దిగా పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా స్థాయిని పెంచడంలో సినిమాటోగ్రఫీ బాగా పనిచేసింది. ఇక ఎడిటింగ్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగానే వున్నాయి.
ప్లస్ పాయింట్స్: రాహుల్ నటన,కథ, ట్విస్ట్స్, ఇంటర్వెల్ సీన్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: కథనం, దర్శకత్వం, పాటలు, ఎడిటింగ్, క్లైమాక్స్, స్క్రీన్ ప్లే
రేటింగ్: 2 .0 /5