వైశాఖం మూవీ రివ్యూ

Update: 2017-07-21 13:44 GMT

నటీనటులు: హ‌రీష్‌, అవంతిక‌, పృథ్వి, కాశీ విశ్వ‌నాథ్‌సాయికుమార్‌, ఈశ్వ‌రీరావు

సంగీతం: డి.జె.వ‌సంత్‌

లైన్ ప్రొడ్యూస‌ర్‌: బి.శివ‌కుమార్‌

నిర్మాత‌: బి.ఎ.రాజు

ద‌ర్శ‌క‌త్వం: జ‌య‌.బి

చంటిగాడు, లవ్లీ వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీపైన తనదైన ముద్ర వేసిన లేడి డైనమిక్ డైరెక్టర్ బి.జయ ఇప్పుడు హ‌రీష్‌, అవంతిక‌ జంటగా వైశాఖం అనే యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించింది. నిర్మాత బి.ఏ రాజు, జయకు స్వయానా భర్త కావడం, టాలీవుడ్ లో బి ఏ రాజు పేరున్న పిఆర్ఓ కావడంతో ఆయన వైశాఖం చిత్రానికి కావలసినంత పబ్లిసిటీ చేయగలిగాడు. ఆయనకు టాప్ హీరోలతో ఉన్న పరిచయాలను వైశాఖం పబ్లిసిటీ కి ఫుల్ గా వాడేసాడు. మహేష్ బాబు తో ఆడియో లాంచ్ చేయించిన వైశాఖం టీమ్ మిగతా పబ్లిసిటీ కార్యక్రమాలకు నాగ చైతన్య, నాగార్జున, త్రివిక్రమ్, నాని వంటి సెలబ్రిటీస్ తో వైశాఖం సినిమా ని ప్రమోట్ చేయించి ఈ సినిమాపై అంచనాలు పెంచగలిగాడు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా పబ్లిసిటీ చేసిన ఈ వైశాఖం చిత్రంలో నటీనటులు కొత్తవారు కావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది మరి ఇంత పబ్లిసిటీ ఏ ఇసినిమాకి జరిగుండదు. ఏ సినిమాకి జరగని కనివిని పబ్లిసిటీతో వైశాఖం చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి సెలబ్రిటీస్ ప్రచారం ఈ సినిమాకు ఎంత కలిసొచ్చిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ: వేణు(హరీష్) చాల తెలివైన కుర్రాడు. హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లోని ప్లాట్ ని అద్దెకు తీసుకుని.... అక్కడ అపార్ట్మెంట్ లోని మిగిలిన వారిని తన అవసరాలకు వాడుకుంటూ తన తెలివి తేటలతో అందరిని పడేస్తుంటాడు. మరి అందరిని వాడుకునే వేణుని వాడెయ్యడానికి ఆ అపార్ట్మెంట్ లోకి భాను(అవంతిక) అనే అమ్మాయి దిగుతుంది. రావడం రావడమే వేణు లవర్ గా అందరికి పరిచయం చేసుకుంటూ బ్యూటీ పార్లర్ పెడుతుంది. అసలు నాకు భాను లవర్ కాదని వేణు బయటికి చెప్పలేక, ఆమెతో స్నేహం చెయ్యలేక చాలా ఇబ్బంది పడుతుంటాడు. అయినా గొడవలు పడుతూ ఉండే ఈ జంట ఒక టైములో కాస్త పెద్దగానే గొడవ పడుతుంది. అస్సలు ఈ గొడవకు కారణం ఏమిటి? వారిద్దరూ అసలు లవ్ లో పడతారా?అసలు భాను ఎందుకు వేణు లవర్ ని అని చెబుతుంది? మరి ఈ విషయాలు తెలియాలంటే వెండితెరమీద వైశాఖం చూడాల్సిందే.

నటీనటుల పాత్ర: సినిమాలకు పరిచయం అవుతున్న హరీష్, అవంతికలు ఇంకా నటనలో మెళుకువలు నేర్చుకోవాలి. వీరి నటన వైశాఖంలో యావరేజ్ గా వుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా తేలిపోయారు. వారి డైలాగ్ డెలివరీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే హరిశ్ డాన్స్ విషయంలో కాస్త పర్వాలేదనిపించాడు. హీరోయిన్ అవంతిక అందంగా వున్నా పెరఫార్మెన్స్ లో ఆకట్టుకోలేకపోయింది. నటుడు సాయి కుమార్ తన పాత్రకు న్యాయం చేసాడు. కృష్ణ భగవాన్, పృద్వి ల కామెడీ ఆకట్టుకునేలా వుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు: డైరెక్టర్ జయ స్టోరీ తో ప్రేక్షకుల మీద దాడి చెయ్యడమే కాదు... పూర్ స్క్రీన్ ప్లే తో సినిమాని నడిపించి ప్రేక్షకుడికి బోర్ కొట్టించింది. కానీ సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటల చిత్రీకరణ, హీరోహీరోయిన్స్ మధ్యన వచ్చే రొమాంటిక్ ట్రాక్ కూడా బాగున్నాయి. కొన్ని కామెడీ సీన్స్, ఎమోషన్ సీన్స్ కూడా రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే వసంత్ మ్యూజిక్ చాలా స్లోగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫర్వాలేదనిపించింది. ఎడిటింగ్లో చాలా లోపాలున్నాయి. అవి సరిచేస్తే సినిమా ఫలితం మరోలా ఉండేది. సెకండ్ హాఫ్ లో లేని సీన్స్ తో చిరాకు తెప్పించాడు. ఇక సినెమాటోగ్రఫీ మాత్రం హైలెట్. ఫారిన్ లొకేషన్స్ ని చాలా అందంగా చూపెట్టడంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు ఇంకాస్త మెరుగ్గా ఉంటే బావుండేది.

ప్లస్ పాయింట్స్: కొన్ని కామెడీ సీన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్ రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, స్లో నేరేషన్, కథ, కథనం, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్

రేటింగ్: 2.25 /5

Similar News