సిద్ధార్థ్ ' గృహం ' షార్ట్ & స్వీట్ రివ్యూ

Update: 2017-11-17 02:28 GMT

ఇటీవ‌ల సౌత్‌లో హ‌ర్రర్ జాన‌ర్‌లో లెక్కకు మిక్కిలిగా సినిమాలు వ‌స్తున్నాయి. హ‌ర్రర్ జాన‌ర్ అంటేనే జ‌నాల‌కు విసుగొచ్చేంత‌గా ఈ సినిమాలు కంటిన్యూగా ఆగ‌డం లేదు. వీటిల్లో కొన్ని హిట్ అవుతుంటే చాలా వ‌ర‌కు క‌థాబ‌లం లేక ఫ‌ట్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తెలుగు, త‌మిళ ప్రేక్షకుల‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న సిద్ధార్థ్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ గృహం. కొద్ది సంవత్సరాలుగా హిట్ లేని సిద్ధార్థ్ నిర్మాత‌గా మారి ఈ సినిమా తీశాడు. కోలీవుడ్‌లో గ‌త‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో ఈ రోజు రిలీజ్ అవుతోంది. ప్రీమియ‌ర్ షోల టాక్ ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో షార్ట్ రివ్యూలో చూద్దాం.

ఆ..ఇంట్లో ఆత్మ....

స్టోరీ ప‌రంగా చూస్తే ఇది కామెడీ, హ‌ర్రర్ జాన‌ర్‌లోనే తెర‌కెక్కింది. ఓ ఇళ్లు అందులోకి ఓ కుటుంబం రావడం, ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఆ ఇంట్లో వాళ్లతో ఓ ఆట ఆడుకోవ‌డం ఇదే త‌ర‌హాలో ఉంటుంది. సినిమా సీరియ‌స్ మోడ్‌లోకి వెళ్లగానే భ‌యం భ‌యంగా ఉంటుంది. సిద్ధార్థ్ - ఆండ్రియా మ‌ధ్య బెడ్ రూం సీన్లు హాట్ హాట్‌గా ఉన్నాయి. వీరిద్దరి మ‌ధ్య లిప్‌కిస్‌లు కావాల్సిన‌న్ని ఉన్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్‌, విజువ‌ల్స్‌తో ద‌ర్శకుడు కావాల్సినంత భ‌య‌పెట్టాడు. అయితే సెకండాఫ్‌లో వ‌చ్చే అదిరిపోయే ట్విస్ట్ ఇది మామూలు హ‌ర్రర్ సినిమాలా కాకుండా ప్రత్యేక‌త‌ను చాటుకుంది. ఇక ఇంట‌ర్వెల్ సీన్ల‌కు ప్రేక్షకుడు ఎంత భ‌య‌ప‌డ్డాడో క్లైమాక్స్‌లో అంత‌కుమించి ప్రేక్షకుడు భ‌య‌ప‌డ‌తాడు. క‌థ జాన‌ర్ ప‌రంగా రొటీనే అయినా ఈ క‌థ‌లో సిద్ధార్థ్ లాంటి ల‌వ‌ర్‌బాయ్‌ను హీరోగా తీసుకోవ‌డం, కావాల్సినంత రొమాన్స్ యాడ్ చేయ‌డం, క‌థ‌లో ఒక‌టి రెండు దెయ్యాలు కాకుండా మూడు దెయ్యాల‌ను పెట్టడం, సెకండాఫ్‌లో వ‌చ్చే ట్విస్టుతో సినిమాకు కొత్త క‌ల‌రింగ్ ఇచ్చిన‌ట్లయ్యింది.

ఫైన‌ల్‌గా...

ఫైన‌ల్‌గా చెప్పాలంటే హ‌ర్రర్‌+కామెడీ జాన‌ర్‌లోనే ఇదో కొత్త ప్రయ‌త్నం. ఇలాంటి జాన‌ర్‌ల‌లో వ‌చ్చిన సినిమాల్లో గృహం ప్రత్యేక‌త‌ను చాటుకుంటుంది. రొమాన్స్ + హ‌ర్రర్ + కామెడీ ఇలా ఇవ‌న్నీ క‌ల‌గ‌లిపి హార‌ర్ కామెడీని రొమాంటిక్ కామెడీగా మార్చేశాడు ద‌ర్శకుడు. సిద్ధార్థ్‌కు చాలా రోజుల త‌ర్వాత మంచి సినిమా. కోలీవుడ్‌లో ఇప్పటికే హిట్ అయిన ఈ సినిమా తెలుగులోను ఓ మోస్తరు వ‌సూళ్లు సాధించొచ్చు.

Similar News