అఖిల్ హలోతో ఈ రోజు థియేటర్లలోకి వచ్చేశాడు. ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా హలో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ టాక్ ప్రకారం హలోకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఉన్న హలోను ఫ్యామిలీతో సహా చూడొచ్చన్న టాక్ తెచ్చుకుంది. సాధారణంగా విక్రమ్ కుమార్ సినిమాల్లో ఇష్క్, మనం, 24 విషయానికి వస్తే ఇంటిలిజెన్స్ కనపడుతోంది. విక్రమ్ ఎలాంటి కథను తీసుకున్నా స్క్రీన్ ప్లేతో చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదు. హలో సినిమాకు విక్రమ్ మనకు కాస్త తెలిసిన కథనే తీసుకున్నా ఆయన మ్యాజిక్ కొన్ని సీన్లకే పరిమితమైందన్న టాక్ వచ్చింది.
ప్లస్‌ల విషయానికి వస్తే...
సినిమాలో కళ్లు చెదిరిపోయే యాక్షన్ సీన్లలో అఖిల్ పెర్పామెన్స్ సూపర్బ్ అంటున్నారు. యాక్షన్ సీన్ల కోసం అఖిల్ చాలా ఎఫర్ట్ పెట్టడంతో పాటు చాలా రిస్క్ చేసినట్టు కూడా విజువల్స్ చెపుతున్నాయి. ఇక తెరపై అఖిల్, ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన కళ్యాణి ప్రియదర్శని జోడీ బాగుందంటున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు, చిన్నప్పుడు విడిపోయే సీన్లు హైలెట్. ఇక నాగార్జున సినిమా కోసం ఎక్కడా రాజీపడకుండా చేసిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోను కనపడుతోంది. ఇక ఇప్పటికే హిట్ అయిన ఆడియోకు, సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బ్యూటిఫుల్‌గా ఉంది. రిచ్ విజువల్స్, మనస్సుకు హత్తుకునే నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి.
మైనస్‌ల లెక్క ఇదే....
సినిమా ఒకే స్టోరీ లైన్ సింపుల్‌గా ఉంటుంది. ప్లాట్ నరేషన్‌తో పాటు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్ అండ్ డన్ అవుతూ ఉంటుంది. ఇక విక్రమ్ కుమార్ మ్యాజిక్ సినిమాలో పాటలతో పాటు కొన్ని సీన్లకే పరిమితం అయ్యింది.
హలోతో అఖిల్ హిట్ టాక్ తెచ్చుకున్నా ఇది ఏ రేంజ్ హిట్ అవుతుందో మాత్రం వెయిట్ అండ్ సీ..!