రూ.2000 నోట్ల ఉపసంహరణపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే చాలా వరకు రూ.2 వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని

Update: 2023-07-04 03:20 GMT

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే చాలా వరకు రూ.2 వేల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ఆర్‌బీఐ వెల్లడించింది. జూన్ 30 నాటికి రూ. 2.72 లక్షల కోట్ల విలువైన బ్యాంక్ నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రజల వద్ద ఇంకా రూ. 84 వేల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయని తెలిపింది.

ఆర్‌బీఐ రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న దాదాపు 76 శాతం వరకు రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది. ప్రజలు బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడం చేశారని.. ఇంకా ఎవరిదగ్గరైనా రూ. 2 వేల నోట్లు ఉంటే బ్యాంకులకు వచ్చి మార్చుకోవాలని కోరింది. సెప్టెంబర్ 30 కల్లా ఈ పని పూర్తి చేసుకోవాలని సూచించింది. మే నెలలో వ్యవస్థలో చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లు రూ. 3.56 లక్షల కోట్లు. అయితే ఇప్పుడు చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లు రూ. 84 వేల కోట్లకు తగ్గాయి. 87 శాతం బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి.
మే 19న ఆర్బీఐ ఈ నోట్లను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 2వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఇచ్చింది. ఈ నిర్ణయం తీసుకునే సమయానికి చలామణిలో 3.62 లక్షల కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ బ్యాంక్‌ల్లో పెద్ద ఎత్తున 2000 రూపాయల నోట్ల డిపాజిట్లు జరిగినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News