Amit Shah : నేడు తమిళనాడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమిళనాడులో పర్యటించనున్నారు.;

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్త బీజేపీ చీఫ్ ను ఆయన ఎంపిక చేసే అవకాశముంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దక్షిణాదిన బలపడాలనుకుంటున్న బీజేపీకి తమిళనాడులో కొంత సాననుకూల పరిస్థితులు ఉన్నాయని గమనించి వేగంగా ఇక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
గెలుపే లక్ష్యంగా...
గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికను రచించేందుకే అమిత్ తమిళనాడుకు రానున్నారు. దీంతో పాటు ఏఐడీఎంకే నేత పళనిస్వామితో కూడా అమిత్ షా భేటీ అవుతారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేసే అంశంపై చర్చించనున్నారు. ఇరు పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యే అమిత్ షా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశముంది. దీంతో తమిళనాడులో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.