Narendra Modi : నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు.;

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మొత్తం 3884 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం 44 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం పది గంటలకు ఆయన వారణాసికి చేరుకుని రాజతలాబ్ లోని మెహందీగంజ్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
3884 కోట్ల ప్రాజెక్టులకు...
మోదీ పర్యటనలో మొత్తం 44 ప్రాజెక్టును జాతికి అంకిత ంచేయనున్నారు. ఇందులో 1629 కోట్ల విలువైన పంధొమ్మిది ప్రాజెక్టులను ప్రారంభిస్తుండగా, మరో ఇరవై ఐదు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కూడా పాల్గొంటారు. మోదీ పర్యటన సందర్భంగా నేడు వారణాసిలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.