తగ్గని కరోనా.. అంతా అప్రమత్తం
భారత్ లో 5,676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 21 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వరసగా ఐదువేల కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కరోనా వైరస్ మరింత విజృంభిస్తుందన్న ఆందోళనను వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా 24 గంటల్లో భారత్ లో 5,676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 21 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
యాక్టివ్ కేసుల సంఖ్య...
దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 36 వేలకు చేరుకుంది. ఇప్పటికే కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. మరో వైపు నిన్న, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది.