ఐస్ క్రీం తిన్న 70 మందికి అనారోగ్యం

పిల్లలు, పెద్దలు, మహిళలంతా అతని వద్ద ఐస్ క్రీమ్ లు కొనుగోలు చేసి తిన్నారు. రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే..

Update: 2023-06-05 03:42 GMT

70 people fell ill in odisha

ఇటీవల కాలంలో బయట లభించే ఆహార పదార్థాలు దాదాపు కల్తీవే ఉంటున్నాయి. రుచి బాగుందని, చల్లగా ఉంటున్నాయని ప్రజలు సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కు బాగా అలవాటుపడిపోయాయి. ఈ మధ్యే హైదరాబాద్ లో ఒకట్రెండు ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై దాడులు చేసి లక్షల్లో కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా.. ఐస్ క్రీమ్ తిని 70 మంది ఆసుపత్రి పాలైన ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదాది పంచాయతీలో వెలుగుచూసింది.

శనివారం (జూన్ 3) పంచాయతీ పరిధిలోని ఘాట్‌గుడ, సొండిపుట్, అల్లిగాం, కమలజ్వాల, నువ్వాపుట్, బడలిగుడ గ్రామాల్లో ఓ వ్యక్తి ఐస్‌క్రీమ్ లు విక్రయించాడు. పిల్లలు, పెద్దలు, మహిళలంతా అతని వద్ద ఐస్ క్రీమ్ లు కొనుగోలు చేసి తిన్నారు. రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే సమయంలో ఐస్ క్రీమ్ లు తిన్నవారంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ మిగతా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దమన్‌జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిలువవున్న ఐస్‌క్రీమ్ లు తినడం వల్ల అది ఫుడ్ పాయిజన్‌ అయి వాంతులు, విరేచనాలు అయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి బాధితులు చికిత్స పొందుతున్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరామర్శించారు. చికిత్స అనంతరం కోలుకున్న 60 మందిని నిన్న డిశ్చార్జ్ చేశారు. మరో 10 మంది ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News