నేడు నేషనల్ పార్క్ లోకి చీతాలు

నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది చీతాలతో బయలుదేరిన కార్గో విమానం కొద్దిసేపటి క్రితం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చేరుకుంది

Update: 2022-09-17 03:36 GMT

నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది చీతాలతో బయలుదేరిన ప్రత్యేక కార్గో విమానం కొద్దిసేపటి క్రితం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చేరుకుంది. అక్కడి నుంచి కునో నేషనల్ పార్క్ వద్దకు చేర్చనున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఈ చీతాలను నేషనల్ పార్కులోకి విడిచిపెట్టనున్నారు. ఇందుకోసం అటవీశాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఈ చీతాలు మన దేశంలో అడుగుపెట్టనున్నాయి.

ప్రధాని మోదీ పుట్టిన రోజు నాడు...
ఈరోజు ప్రధాని మోదీ పుట్టిన రోజు కూడా కావడంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొని తన జన్మదిన వేడుకలను ప్రధాని జరుపుకుంటారు. ఇక్కడే రోజంతా గడపాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆడ చీతాలు ఐదు, మగ చీతాలను మూడింటిని భారత్ కు తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది నేషనల్ పార్కు వద్ద ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News