హజ్ యాత్రకు వెళ్లి 577 మంది మృతి
హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 577 మంది మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి
హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 577 మంది మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అరబ్ దౌత్యవేత్తలు తెలిపిన ప్రకారం మరణించిన వారిలో ఎక్కువ మంది ఈజిప్ట్, జోర్డాన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. హజ్ యాత్రలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తగిలి కొందరు, ఉక్కపోతకు గురయి మరికొందరు మరణించారని చెబుతున్నారు. మరణించిన వారిలో 323 మంది ఈపిప్షియన్లు ఉన్నారని చెబుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక ఇంత పెద్ద స్థాయిలో మరణించారని, ఇప్పటి వరకూ 577 మంది వరకూ హజ్ యాత్రకు వచ్చిన వారిలో మరణించి ఉండవచ్చని అధికారులు స్పష్టం చేశారు. యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు చెబుతున్నారు.
ఎండల తీవ్రతతోనే...
అక్కడి యంత్రాంగం వేడి నుంచి ఉపశమనం కల్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో మరణించడం ఆందోళనకు గురి చేస్తుంది. మక్కాలోని అతి పెద్ద ఆసుపత్రి అయిన అల్- ముయిసెమ్ ఆసుపత్రి మార్చురీలో 550 మృతదేహాలనున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఎండ వేడిమికి తట్టుకోలేక మరణించారని చెబుతున్నారు. ఎండ వేడిమితో ఇబ్బంది పడే వారిని గుర్తించి వెంటనే వారికి చికిత్స అందిస్తున్నారు. అయినా సరే మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సుమారు రెండు వేల మంది హజ్ యాత్రికులు ఎండదెబ్బకు అనారోగ్యం పాలయినట్లు గుర్తించామని అధికారులు స్పష్టం చేశారు. వీరందరికీ వైద్య సౌకర్యం కల్పించామని తెలిపారు.