Breaking : నింగిలోకి అగ్నిబాణ్.. ఐదో ప్రయత్నంలో విజయవంతం

అగ్నిబాణ‌్ ప్రయోగం విజయవంతమయింది. శ్రీహరి కోటలోని స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి నింగిలోకి అగ్ని బాణ్ దూసుకెళ్లింది.

Update: 2024-05-30 02:45 GMT

అగ్నిబాణ‌్ ప్రయోగం విజయవంతమయింది. శ్రీహరి కోటలోని స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి నింగిలోకి అగ్ని బాణ్ దూసుకెళ్లింది. నాలుగు సార్లు అగ్నిబాణ్ లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అగ్నిబాణ్ ను ప్రయోగాన్ని నిలిపివేశారు. ఐదవ ప్రయత్నంలో శాస్త్రవేత్తలు అగ్నిబాణ్ ను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు.

తొలి సెమీ క్రయోజనిక్...
దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ ను ప్రవేవపెట్టారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రయివేటు స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్ లో ప్రయివేట సంస్థలు రూపొందించిన చిన్న తరహా ఉపగ్రహాలను ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.


Tags:    

Similar News