Petrol : పెట్రోలు ధర లీటరుపై పది రూపాయలు తగ్గింపు
పెట్రోలు ధరలు తగ్గయాంటే ఎవరికి మాత్రం ఆనందం ఉండదు
పెట్రోలు ధరలు తగ్గయాంటే ఎవరికి మాత్రం ఆనందం ఉండదు. ఎందుకంటే రోజువారీ బండి ముందుకు కదలాలంటే పెట్రోలు, డీజిల్ అవసరమవుతాయి. వాహనంతో ఎక్కడకు వెళ్లాలన్నా పెట్రోలు అవసరం అందుకే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ కు అంత డిమాండ్ ఉంటుంది. అలాంటి పెట్రోలు ధరపై ధరలు తగ్గితే ఇంక ఎంత ఆనందం ఉంటుంది. అదే ఇప్పుడు పాకిస్థాన్ లో జరిగింది.
పాకిస్థాన్ లో...
పాకిస్థాన్ లో పెట్రోలు ధరలపై పది రూపాయలు లీటరుపై తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బక్రీద్ పండగ సందర్భంగా ఈ శుభవార్తను పాక్ ప్రజలకు తెలియచేసింది. పాక్ లో ద్రవ్యోల్బణం కారణంగా పెట్రోలు ధరలు కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే దీనిపై పది రూపాయలు లీటరుపై తగ్గించడంతో గుడ్డిలో మెల్లగా కొంత ఆనందం పాక్ ప్రజల్లో వ్యక్తమవుతుంది.