నేటి నుంచి ఎయిర్‌పోర్టుల్లో మంకీపాక్స్ పరీక్షలు

విమాన ప్రయాణికులకు నేటి నుంచి మంకీపాక్స్‌ పరీక్షలు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్ల నిర్వహించనున్నారు

Update: 2024-08-21 07:13 GMT

gannavaram airport

విమాన ప్రయాణికులకు నేటి నుంచి మంకీపాక్స్‌ పరీక్షలు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్ల నిర్వహించనున్నారు. మంకీపాక్స్‌ ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లోకి రాకుండా కట్టడికి కేంద్రప్రభుత్వం పలు ముందస్తు చర్యలు తీసుకుంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇతర దేశాల నుంచి...
ప్రధానంగా పాకిస్థాన్ వంటి దేశాల్లో కూడా మంకీ పాక్స్ కేసులు బయటపడటంతో దేశమంతా కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ చేసింది. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మంకీ పాక్స్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రపంచంలోని 70 దేశాల్లో మంకీ పాక్స్ విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News