అమరనాధ్ యాత్రలో కొత్త నిబంధన ఏంటంటే?

అమరనాధ్ యాత్ర ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఈ యాత్ర చేయడానికి అనేక మంది భక్తులు ఎదురు చూస్తుంటారు.

Update: 2023-04-18 03:01 GMT

అమరనాధ్ యాత్ర ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఈ యాత్ర చేయడానికి అనేక మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. భారీ సంఖ్యలో అమరనాధ్ యాత్రకు వస్తుంటారు. దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయాల్లో మంచురూపంలో కనిపించే శివలింగాన్ని దర్శించుకునేందుకు వ్యయ ప్రయాసలకోర్చి భక్తులు వస్తుంటారు. దీంతో అమరనాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయింది.

జులై 1 నుంచి...
జులై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ అమరనాధ్ యాత్ర జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటంచింది. మొత్తం 62రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్లు అధికమంది చేసుకునే అవకాశముందని భావించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏడాది మాత్రం రెండు మార్గాల్లో యాత్ర కొనసాగుతుందని తెలిపారు.


Tags:    

Similar News