సిక్కింలో భూకంపం
సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రత నమోదయింది.
సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రత నమోదయింది. ఈ రోజు ఉదయం 4.15 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ ఫరి సిస్మోలజీ తెలిపింది. భూకంప తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచిన కొందరు బయటకు పరుగులు తీశారు.
బయటకు పరుగులు...
ఇంట్లో వస్తువులు కదలడంతో భూప్రకంపనలు సంభవించినట్లు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. తుర్కియా, సిరియాలలో భూకంపం సంభవించి వేలాది మంది మృత్యువాత పడటంతో సిక్కిం ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని నేషనల్ ఫరి సిస్మోలజీ అధికారులు తెలిపారు.