ఈరోజూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో...?

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కూడా యుద్ధ వాతావరణం నెలకొంది.;

Update: 2024-11-08 05:04 GMT

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. బీజేపీ, ఎన్సీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఆర్టికల్ 370పై తీర్మానానికి ఎన్సీ సభ్యులు పట్టుపట్టారు. దీనిని ఎన్సీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బాహాబాహీకి తలపడ్డారు. వరసగా ఈరోజు కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు రణరంగంగా మారాయి.

తోపులాటతో...
2019లో తొలగించిన 370, 32ఎ ను పునరుద్ధరించాలని పీడీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశం పెట్టింది. మరోవైపు ప్రత్యేక రాష్ట్ర హోదాను జమ్మూ కాశ్మీర్ కు ఇవ్వాలని కోరుతుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్ వచ్చి ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుంటున్నారు.
Full View


Tags:    

Similar News