బీ అలర్ట్.. థర్డ్ వేవ్ వచ్చేస్తోంది - రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

కేసులు పెరిగితే.. కరోనా, ఒమిక్రాన్ లను కట్టడి చేయడం కష్టమమవుతుందని తెలిపింది. థర్డ్ వేవ్ వచ్చేస్తోంది.. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Update: 2021-12-23 10:38 GMT

ఒమిక్రాన్ రూపంలో దేశంలో థర్డ్ వేవ్ దాడి చేసేందుకు సిద్ధమవుతుందని కేంద్రం హెచ్చరిస్తోంది. థర్డ్ వేవ్ ను కంట్రోల్ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. పాజిటివ్ కేసులను నియంత్రించే దిశగా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్రాలకు సూచించింది. కేసులు పెరిగితే.. కరోనా, ఒమిక్రాన్ లను కట్టడి చేయడం కష్టమమవుతుందని తెలిపింది. థర్డ్ వేవ్ వచ్చేస్తోంది.. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిందది.

పండుగల్లో రద్దీ నివారించాలి

కోవిడ్, ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న క్లస్టర్లను పర్యవేక్షించాలని సూచించింది. అలాగే రానున్న పండుగల సీజన్లలో ఆంక్షలు, పరిమితులను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపింది. నైట్ కర్ఫ్యూలు విధించే విషయంలో ఏమాత్రం తగ్గొద్దన్న కేంద్రం.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో కఠినమైన చర్యలు చేపట్టాలని, అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. కోవిడ్ క్లస్టర్‌లలో కంటైన్‌మెంట్ జోన్‌లు, బఫర్ జోన్‌లకు ఏర్పాటు చేసేలా చూసుకోవాలని స్పష్టంచేసింది. వీలైనంత మేర లబ్ధిదారులకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని, వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దానిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది.


Tags:    

Similar News