అత్యంత అందమైన విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు

Kempegowda International Airport: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 యునెస్కో 'వరల్డ్స్ స్పెషల్ ప్రైజ్ ఫర్ ఏ;

Update: 2023-12-26 13:41 GMT

 kempegowda international airport

Kempegowda International Airport: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 యునెస్కో 'వరల్డ్స్ స్పెషల్ ప్రైజ్ ఫర్ ఏ ఇంటీరియర్ 2023' కింద అత్యంత అందమైన విమానాశ్రయ అవార్డును అందుకుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయం అవార్డును(Worlds most beautiful airport)

అందుకున్న భారతదేశంలోని మొదటి విమానాశ్రయం. విమానాశ్రయం టెర్మినల్ 2 2 లక్షల 55 వేల 661 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.



  ఈ విమానాశ్రయంలో మీరు కర్ణాటక సంస్కృతిని తిలకించవచ్చు. ఈ విమానాశ్రయం టెర్మినల్ 2 నవంబర్ 22, 2022న ప్రారంభించారు. అత్యంత అందమైన విమానాశ్రయం అవార్డును అందుకున్నందుకు ప్రధాని మోదీ కూడా దాని ఫోటోను పంచుకోవడం ద్వారా అభినందించారు. ఈ విమానాశ్రయం ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Tags:    

Similar News