నేడు భారత్ బంద్
కాంగ్రెస్ నేతల బృందం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనుంది.
గత వారం ప్రభుత్వం తీసుకుని వచ్చిన 'అగ్నిపథ్' మిలిటరీ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా 10 కంటే ఎక్కువ రాష్ట్రాలలో నిరసనలు మొదలయ్యాయి. దీంతో కొన్ని సంస్థలు సోమవారం దేశవ్యాప్తంగా 'భారత్ బంద్' కోసం పిలుపునిచ్చాయి. ఆర్మీ ఉన్నతాధికారి కూడా ఇప్పటికే ప్రదర్శనకారులకు వార్నింగ్ ఇచ్చారు. "భారత సైన్యం అనేది క్రమశిక్షణతో కూడుకున్నది. ఇక్కడ దహనం లేదా విధ్వంసానికి స్థలం లేదు. ప్రతి వ్యక్తి తాము నిరసనల్లో, విధ్వంసంలో భాగం కాదని ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి. పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి, అది లేకుండా ఎవరూ సైన్యంలో చేరలేరు" అని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి ఆదివారం కీలక వ్యక్త్లు చేశారు. ఇక దీనిపై కాంగ్రెస్ నేతల బృందం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనుంది.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పలు నిరసన బృందాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా, ఝార్ఖండ్, పంజాబ్, కేరళ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాయి. బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.