Bharath Bandh : నేడు భారత్ బంద్
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతుంది
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతుంది. రిజర్వేషన్ బచావో సమితి ఈ బంద్ కు పిలుపు నిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ కు పిలుపు నిచ్చింది. ఎస్సీ వర్గీకరణ కారణంగా ఎస్సీ, ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందని ఈ బంద్ కు పిలుపు నిచ్చినట్లు తనిర్వాహకులు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు...
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కు తీసుకోవాలని మాల సామాజికవర్గం నేతలతో పాటు రిజర్వేషషన్ బచావో సంస్థ భారత్ బంద్ కు పిలుపు నివ్వడంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని సమితి పిలుపు నిచ్చింది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.