శబరిమలలో అన్నదానానికి భారత్ బయోటెక్ భారీ విరాళం

భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసే అన్నదానానికి రూ.కోటి విరాళం అందించారు.

Update: 2021-12-09 06:35 GMT

కార్తీక మాసం మొదలయ్యిందంటే చాలు.. శబరి గిరులు స్వామియే శరణం అయ్యప్పా అనే నామ స్మరణతో మారు మోగిపోతుంటాయి. ఎంతో నిష్టగా, భక్తితో అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు.. శబరిమల వచ్చి అయ్యప్పను దర్శించుకుని మాల విరమణ చేస్తారు. ఏటా ఇక్కడికి అయ్యప్ప స్వాములు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారికి కన్నెస్వాములు కూడా ఎక్కువగానే ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు దారిమధ్యలో ఉన్న దేవాలయాల్లో విశ్రాంతి తీసుకుని, మరలా ప్రయాణం మొదలుపెడుతారు.

గత ఏడాది కరోనా కారణంగా...
మరి శబరిమల వచ్చే స్వాములకు భోజనం ఎలా ? అనుకుంటున్నారా. ప్రతి ఏటా శబరి గిరులు ఎక్కి స్వామిని దర్శించుకునేందుకు వచ్చేవారికోసం అన్నదానం చేస్తుంటారు. కానీ గత ఏడాది కరోనా కారణంగా ఈ అన్నదాన కార్యక్రమానికి ఆటంకం ఏర్పడింది. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గుముఖం పట్టడంతో.. మరలా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ అన్నదానంలో తనవంతు సాయంగా భారత్ బయోటెక్ భారీ విరాళాన్ని ప్రకటించింది.
కోటి రూపాయలు...
భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసే అన్నదానానికి రూ.కోటి విరాళం అందించారు. శబరిమల కార్యనిర్వాహక అధికారి వి.కృష్ణకుమార్‌ వారియర్‌కు ఈ విరాళాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అందజేశారు. అనంతరం ఎండీ ఎండీ కృష్ణ ఎల్ల తన భార్య సుచిత్ర ఎల్లతో కలిసి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమం కోసం ఆలయానికి రూ.కోటి విరాళం ప్రకటించిన డా.కృష్ణ ఎల్ల దంపతులకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు అనంతగోపన్ కృతజ్ఞతలు తెలిపారు.


Tags:    

Similar News