కీలక నిర్ణయం 14 యాప్‌లపై నిషేధం

కేంద్ర ప్రభుత్వం మరో పథ్నాలుగు యాప్‌లను బ్లాక్ చేసింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2023-05-01 06:40 GMT

కేంద్ర ప్రభుత్వం మరో పథ్నాలుగు యాప్‌లను బ్లాక్ చేసింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. భారత రక్షణ దళాలు, భద్రత, ఇంటలిజెన్స్ దర్యాప్తు సంస్థల నివేదికల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

ఉగ్రవాదులకు...
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 69 ఎ ప్రకారం ఈ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌స్విస్, విక్రమ్, మీడియాఫైర్, బ్రియార్ వంటి యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఇకపై ఈ యాప్‌లను భారత్‌లో వినియోగించడానికి వీలులేకుండా ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News