Maharashtra Elections : నేడు మహారాష్ట్రలో శాసనసభ పక్ష సమావేశం
మహారాష్ట్ర ఎన్నికలు పూర్తి కావడంతో ఈరోజు అన్ని పార్టీలు తమ శాసనసభ పక్ష సమావేశాలను నిర్వహించుకుంటున్నాయి.;
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిశాయి. అయితే 72 గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉండటంతో ఈరోజు అన్ని పార్టీలు తమ శాసనసభ పక్ష సమావేశాలను నిర్వహించుకుంటున్నాయి. ప్రధానంగా బీజేపీ తమ శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మహరాష్ట్ర ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడంతో బీజేపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
మరో రెండు పార్టీలు కూడా...
మరోవైపు ఏక్ నాధ్ షిండేకు చెందిన శివసేన వర్గం కూడా నేడు సమావేశమై తమ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనుంది. ఏక్ నాధ్ షిండేను తమ నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు అజిత్ పవార్ వర్గం కూడా నేడు సమావేశమై నేడు శాసనసభ పక్ష నేత ను ఎన్నుకోనుంది. అజిత్ పవార్ కూడా సీఎం రేసులో ఉన్నారంటున్నారు. మొత్తం మీద నేడు మహారాష్ట్ర శాసనసభ పక్ష నేత ఎన్నిక ఆసక్తిగా జరగనుంది. అయితే మహా వికాస్ అఘాడీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు